Pawan Kalyan Hari Hara Veeramallu: పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది హరి హర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. మొఘలుల కాలం నాటి ఈ కథలో పెద్దలను దోచి పేదవారికి పెట్టే దొంగగా పవన్ కనిపించనున్నారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కితున్నారు.చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న హరి హర వీరమల్లుకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడాది షూటింగ్ నిలిచిపోయింది. పవన్ పొలిటికల్ ఈవెంట్స్ కూడా ఒక కారణం.

ఒక దశలో హరి హర వీరమల్లు పూర్తి అవుతుందా లేదా అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేశారు. అయితే అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ హరి హర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం షూట్ కి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది. చిత్రికరణ త్వరలో ప్రారంభం కానుంది. రెండు వారాలుగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వర్క్ షాప్ లో పాల్గొంటున్నాడు. కాగా వర్క్ షాప్ లో కఠిన యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది.
సదరు ఫొటోలో పవన్ కళ్యాణ్ హుడీ జాకెట్ ధరించి ఉన్నారు. ప్రత్యర్థులపై పంచ్ ఎక్కుపెట్టి తీక్షణంగా చూస్తున్న పవన్ ఫోజ్ మెస్మరైజ్ చేస్తుంది. హాలీవుడ్ యాక్షన్ హీరోలను తలపిస్తున్న పవన్ లేటెస్ట్ లుక్ గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ కాగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలాగే హరి హర వీరమల్లు తో పవన్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హరి హర వీరమల్లు మూవీలో యాక్షన్ సన్నివేశాలు మరో లెవెల్ లో ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.

నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తున్నారు. నోరా ఫతేహి మరో కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి కాగా, 2023 సమ్మర్ కానుకగా విడుదలయ్యే సూచనలు కలవు. ఈ చిత్ర విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.