Khushi Movie Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది..టాలీవుడ్ లో ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నారు..పాన్ ఇండియా మరియు పాన్ వరల్డ్ రేంజ్ లో సూపర్ హిట్స్ కూడా అందుకున్నారు..కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఎందుకు అంత క్రేజ్ అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కాదు..బహుశా కెరీర్ ప్రారంభం లో ఆయన చేసిన సినిమాలే ఆయనని ఈ స్థాయి లో నిలబెట్టాయి కావొచ్చు.
ఎందుకంటే ఆ సినిమాలు ఇప్పుడు ఉన్న యువత చూసినా కల్ట్ ఫ్యాన్స్ అయిపోతారు..ఒక యువకుడు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోవచ్చు అనే విధంగా ఆయన వింటేజ్ సినిమాలు ఉంటాయి..అందుకే పవన్ కళ్యాణ్ అంటే యూత్ కి అంత పిచ్చి..ఇక ఆయన కెరీర్ ని ‘ఖుషి’ కి ముందు..’ఖుషి’ తర్వాత అని విభజించవచ్చు..అప్పట్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం అది.
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతున్నందున ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేస్తే చూడాలనే కోరిక లక్షలాది మంది అభిమానులలో ఉంది..వాళ్ళందరి కోరికని నెరవేరుస్తూ ఈ చిత్రాన్ని ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాత AM రత్నం నిన్న అధికారికంగా ఒక ప్రకటన చేసాడు..ఎప్పుడైతే ఆయన ఆ ప్రకటన చేసాడో అప్పటి నుండి ఖుషి మూవీ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అయిపోయింది.
ఇక బుక్ మై షో లో అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమా టికెట్స్ ని బుక్ చేసుకునేందుకు వెతకడం మొదలు పెట్టేసారు..అలా ఒకేసారి వేలాది మంది బుక్ మై షో లో ఖుషి సినిమా కోసం సెర్చ్ చెయ్యడం వల్ల ‘అవతార్ 2 ‘ చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానం లో ట్రేండింగ్ అవడం మొదలు పెట్టింది..కేవలం ఒక్క ప్రకటన కి ఈ రేంజ్ విద్వంసం సృష్టిస్తే ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.