
Game Changer- Pawan Kalyan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీ గురించి రోజుకి ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వస్తుంది. నిన్న జరిగిన దిల్ రాజు ప్రెస్ మీట్ లో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యబోతున్నట్టు తెలిపాడు. జనవరి 12 వ తేదీన ఈ సినిమా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.
ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా , మిగిలిన భాగాన్ని కూడా రాబొయ్యే రెండు నెలల్లో పూర్తి చేసి విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారట. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘గేమ్ చేంజర్’ చిత్రం ఎలా మొదలైంది అనే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.దిల్ రాజు తో శంకర్ ప్రాజెక్ట్ ఎప్పుడో ఖరారు అయ్యింది, మంచి కథ దొరికినప్పుడు చెప్తానని శంకర్ మాట ఇచ్చాడట.
ఇచ్చిన మాట ప్రకారం సరైన సబ్జెక్టు దొరకగానే శంకర్ ఆఫీస్ నుండి కాల్ వచ్చిందట, ముందుగా ఈ కథ ని పవన్ కళ్యాణ్ కోసమే అనుకున్నాడట డైరెక్టర్ శంకర్, కానీ దిల్ రాజు ఈ కథ పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి బాగా సెట్ అవుతుంది, నేను ఒకసారి కలిసి ఈ కథని ఆయనకీ వినిపిస్తాను అని చెప్పాడట. ఆ తర్వాత దిల్ రాజు #RRR మూవీ సెట్స్ కి వెళ్లడం, రామ్ చరణ్ కి కథ వినిపించడం, ప్రాజెక్ట్ ఓకే చేయించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ మరియు లీకైన ఫోటోలను చూస్తూ ఉంటే, ఇది పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన కథలాగా ఉన్నట్టు అభిమానులకు అనిపిస్తుంది.ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కథ, శంకర్ ఇలాంటి అద్భుతంగా చూపిస్తాడు, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని చేసి ఉంటే ఆయన కచ్చితంగా చాలా ఉపయోగపడేది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల అడిగినంత డేట్స్ ఇవ్వలేకపోవచ్చు, శంకర్ లాంటి లెజండరీ డైరెక్టర్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే దిల్ రాజు కావాలని ఇలా చేసాడనే రూమర్ కూడా ఇండస్ట్రీ లో ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన సబ్జెక్టు ని వదులుకోవాల్సి వచ్చినందుకు ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.