Pawan Kalyan Unstoppable: కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడుఎప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ఈరోజు ఆహా యాప్ లో స్ట్రీమ్ అయ్యింది..ఈ ఎపిసోడ్ లో మంకెవ్వరికి తెలియని పవన్ కళ్యాణ్ సరికొత్త కోణాలు తెలిసాయి..బాలయ్య బాబు ఇప్పటి వరకు ఎంతో మంది సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించాడు.

ఎవ్వరి గురించి కూడా ఈ రేంజ్ లో పొగుడుతూ మాట్లాడినట్టు మనం చూసి ఉండము..అలాంటిది పవన్ కళ్యాణ్ ని ఎపిసోడ్ మొత్తం పొగుడుతూనే ఉన్నాడు..అంతే కాకుండా రాజకీయ నాయకులూ పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఏకైక సాధకం గా వాడుకునే మూడు పెళ్లిళ్ల గురించి బాలయ్య అడిగిన ప్రశ్న కి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఎంతో స్వచంగా అనిపించింది..ఆ సమాధానం విన్న తర్వాత బాలయ్య బాబు పవన్ మీద రాజకీయ నాయకులు చేసే కామెంట్స్ పై చాలా ఘాటుగా రిప్లై ఇస్తాడు.
ముందుగా బాలయ్య బాబు మాట్లాడుతూ ‘అసలు ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా’ అని అంటాడు..దానికి పవన్ కళ్యాణ్ చాలా కూల్ గా సమాధానం చెప్తూ ‘నా మీద విమర్శలు చెయ్యడానికి రాజకీయ నాయకులకు ఎదో ఒకటి కావాలి కదా..ఇది దొరికింది..పోనిలే అని అనుకున్నాను కానీ సీరియస్ గా తీసుకోలేదు..అయితే వాళ్లందరికీ వేరే చోట అయ్యి ఉంటే వేరేలా సమాధానం చెప్పేవాడిని..కానీ బాలయ్య లాంటి పెద్దలు ఉన్న షో కాబట్టి చాలా మర్యాదగా సమాధానం చెప్తున్నాను.

నేనేమి ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు..అసలు నా జీవితం లో పెళ్లి చేసుకోకూడదు..బ్రహ్మచారి గా మిగిలిపోవాలని అనుకున్నాను..కానీ దేవుడు నా తలరాత అలా రాసాడు..ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు కచ్చితంగా ఉంటాయి.. వాటి వల్ల విడిపోవాల్సి వచ్చింది..అంతే కానీ నేనేమి వ్యామోహం తో పెళ్లి చేసుకోలేదు..ప్రతీ కుటుంబం లో ఉన్నట్టే మా కుటుంబం లో కూడా సమస్యలు వచ్చాయి’ అంటూ సమాధానం ఇచ్చాడు..అప్పుడు బాలయ్య ‘ఇదంతా విన్న తర్వాత కూడా మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్ చేసే వాడు పిచ్చి కుక్కతో సమానం’ అని జవాబు ఇచ్చాడు.