Pawan Kalyan- Sujeeth: టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కబోతున్న సినిమాలలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి #OG..పవన్ కళ్యాణ్ మరియు సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది..ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ , సురేష్ బాబు మరియు దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో అప్పుడే చాలా విషయాలు లీక్ అయ్యాయి..ఇందులో హీరోయిన్ ఆ ప్రియాంక మోహన్ నటించబోతున్నట్టు సమాచారం..ఇక రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని సంగీతం అందించిన థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నాడు..ముందుగా అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అందరూ అనుకున్నారు కానీ, చివరికి థమన్ ఓకే అయ్యాడు.
మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ సుజిత్..మొదటి భాగం వచ్చే సమ్మర్ లో విడుదల చేసి రెండవ భాగం కూడా అదే ఏడాది చివర్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..ఈ చిత్రానికి అంత స్కోప్ ఉందని తెలుస్తుంది..ఇప్పుడు ఇండియా వైడ్ సీక్వెల్స్ ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో మన అందరికి తెలిసిందే..KGF చాప్టర్ 2 , బాహుబలి 2 వంటి చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించాయి..ఇప్పుడు అదే విధంగా #OG కూడా అలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

అయితే డైరెక్టర్ సుజిత్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకి చెప్పాడు..ఇది కేవలం గ్యాంగ్ స్టర్ స్టోరీ మాత్రమే కాదు..ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంటుందట..అభిమానులు పవర్ స్టార్ ని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించేందుకు డైరెక్టర్ సుజిత్ సన్నాహాలు చేస్తున్నాడు.