
Pawan Kalyan – Sai Dharam Tej Movie First Look: నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు ఉన్న పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీ అప్పుడే చివరి దశకి వచేస్తుందట.రోజుకి పది గంటలు విరామం లేకుండా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడట.ఒకే లొకేషన్ లో ముల్టీపుల్ సెట్స్ వేసి ఒక షాట్ అయిపోగానే మరో షాట్ కి వెళ్ళిపోయాడట డైరెక్టర్ సముద్ర ఖని.అన్ని షాట్స్ కి కేవలం ఒకటి రెండు టేకులకు మించి తీసుకోవట్లాడట పవన్ కళ్యాణ్.
ఈ సినిమా కోసం ఆయన తొలుత 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు, కానీ డైరెక్టర్ సముద్ర ఖని మరికొన్ని డేట్స్ అడగడం తో ఈ నెల మొత్తం డేట్స్ ని కేటాయించేసాడు పవన్ కళ్యాణ్.10 వ తేదీ వరకు షూటింగ్ లో పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్, 11 వ తేదీ నుండి రాజకీయ కార్యకలాపాలలో బిజీ కాబోతున్నాడు.14 వ తేదీన మచిలీపట్టణం లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ 16 వ తేదీ నుండి మార్చి 24 వరకు డేట్స్ కేటాయించబోతున్నాడు.
దాంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందట.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు.ఇంత స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ ని చూసి చాలా కాలం అయ్యింది అని అభిమానులు ఆశ్చర్యపొయ్యే రేంజ్ లో ఉంటుందట పవర్ స్టార్ లుక్.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ నెల 22 వ తారీఖున విడుదల చేయబోతున్నారట.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతుంది మూవీ టీం.ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి ప్రాత్రలో కనిపించబోతున్నాడు.

తమిళం లో సూపర్ హిట్ అయినా ‘వినోదయ్యా సీతం’ స్టోరీ లైన్ ని తీసుకొని, మొత్తం పవన్ కళ్యాణ్ స్టైల్ కి మార్చి, కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేసి ఈ స్క్రిప్ట్ ని తయారు చేసాడట త్రివిక్రమ్.ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం గా ఉండడం తో షూటింగ్ కూడా శరవేగంగా సాగిపోతుంది.ఆగష్టు 11 వ తారీఖున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.ఇంత తొందరగా పవన్ కళ్యాణ్ సినిమా అయిపోతుండడం చరిత్ర లో ఇదే తొలిసారి అంటున్నారు ట్రేడ్ పండితులు.