Pawan Kalyan “Varasudu” : తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వారిసు’ జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది..మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగు లో ‘వారసుడు’ అనే పేరు తో విడుదల అవ్వబోతుంది..ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
ప్రస్తుతం విజయ్ మార్కెట్ సౌత్ లో అందరి స్టార్స్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది..ఎంతలా అంటే రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన బీస్ట్ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కేవలం విజయ్ స్టార్ స్టేటస్ వల్ల సూపర్ హిట్ గా నిలిచింది..ప్రస్తుతం ఆయన బాక్స్ ఆఫీస్ పవర్ ఆ రేంజ్ లో ఉందిమరి..తెలుగు లో కూడా ఆయన తన మార్కెట్ ని చిన్నగా పెంచుకుంటూ పోతున్నాడు.
ఆయన హీరో గా నటించిన మాస్టర్, పోలిసోడు, విజిల్ మరియు అదిరింది వంటి చిత్రాలు తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచాయి..అందువల్ల వారసుడు సినిమాకి కూడా ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడింది..ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఈ నెల 24 వ తారీఖున చెన్నై లో జరగనుంది..అలాగే తెలుగు లో 27 వ తారీఖున జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా పిలవబోతున్నారు అట..ఒకే వేదిక పై పవన్ కళ్యాణ్ మరియు విజయ్ వంటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ కనపడితే ‘వారసుడు’ సినిమాకి తెలుగు లో బిజినెస్ ఒక రేంజ్ లో పెరుగుతుందని.
ఓపెనింగ్స్ ద్వారానే సేఫ్ అవ్వొచ్చు అని దిల్ రాజు ప్లాన్ అట..గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బంగారం మూవీ ఓపెనింగ్ కి విజయ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..ఆ తర్వాత వీళ్లిద్దరు ఎప్పుడు కలవలేదు..విజయ్ స్వయంగా పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అని పలు సందర్భాలలో ఆయనే తెలిపాడు..సుమారుగా 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు పబ్లిక్ స్టేజీ మీద కలవడం ఫ్యాన్స్ కి కనులపండుగే అని చెప్పొచ్చు.