Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే..మొన్న కౌలు రైతు భరోసా కార్యక్రమం ని నిర్వహించిన పవన్ కళ్యాణ్, పక్క రోజే ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు..ఇలా ఇంత బిజీ షెడ్యూల్ ఉంటె మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు..వీటితో పాటుగా ఆయన వ్యక్తిగత వ్యవహారాలు కూడా చూసుకోవాలి.

ఈమధ్యనే ‘హరి హర వీరమల్లు’ సినిమాకి సంబంధించి ఒక లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు భార్య కోసం రష్యా కి పయనం అవ్వబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది..ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తన పుట్టిల్లు అయినా రష్యా కి వెళ్తుంది..అక్కడ కొన్ని రోజులు పండగ జరుపుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా కి వస్తుంది..ఇప్పుడు కూడా ఆమె రష్యా లో గత కొద్దీ రోజుల నుండి ఉంటుంది.
ఎన్ని పనులు ఉన్నా పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సెలవలు వచ్చినప్పుడు మాత్రం తన భార్య పిల్లలతో గడపడానికి రష్యా కి వెళ్తుంటాడు..కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు..ఇప్పుడు కూడా ఆయన రష్యా కి పయనం అవ్వబోతున్నాడట..మళ్ళీ తిరిగి వచ్చే గురువారం రోజు ఇండియా కి వస్తాడని..రాగానే ‘హరి హర వీరమల్లు’ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది..మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్షణ కాలం కూడా తీరిక లేకుండా ఉంటున్నాడని..ఆయన ఈసారి రష్యా కి వెళ్లకపోవచ్చుననే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే అక్టోబర్ నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాన్ని తెరకెక్కించాడు..పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ యాక్షన్ బ్లాక్ మొత్తం హైలైట్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..తదుపరి షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది..సమ్మర్ కానుకగా ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.