
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంగీకరించిన సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. హరి హర వీరమల్లు సెట్స్ పై ఉండగా… పవన్ వినోదయ సితం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ డైరెక్షన్ లో ఒక మూవీ ప్రకటించారు. వినోదయ సితం రీమేక్ కోసం పవన్ కేవలం 22 రోజులు కేటాయించినట్లు సమాచారం. ఆల్రెడీ రెండు వారాలకు పైగా షూటింగ్లో పాల్గొన్నారట. మరో వారంలో వినోదయ సితంలో ఆయన షూటింగ్ పార్ట్ పూర్తి కానుందట. ఈ మేరకు సమాచారం అందుతుంది. మొదట పవన్ కళ్యాణ్ సన్నివేశాలు చిత్రీకరించేలా షెడ్యూల్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ నిరవధికంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నారు.
వినోదయ సితం మూవీలో పవన్ మోడ్రన్ గాడ్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర నిడివి కూడా తక్కువగానే ఉంటుందని సమాచారం. మరో హీరో సాయి ధరమ్ రోల్ పూర్తి స్థాయిలో ఉంటుంది. మనిషికి, దేవుడికి మధ్య జరిగే సెటైరికల్ అండ్ హ్యూమరస్ డ్రామానే ఈ చిత్రం. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్నారు. మూల కథ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీ, పవన్ , సాయి ధరమ్ తేజ్ ఇమేజెస్ కి తగ్గట్లు త్రివిక్రమ్ భారీ మార్పులు చేసినట్లు సమాచారం. దసరా కానుకగా థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కలవు.
వినోదయ సితం రీమేక్ కి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయ్యింది. యాభై కోట్లు తీసుకున్న పవన్ రోజుకు రెండున్నర కోట్లకు పైగా ఛార్జ్ చేసినట్లు అయ్యింది. ఇది టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరూ చేరుకోలేని ఫీట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మేకర్స్ మాత్రం దేవుడు అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యారని సమాచారం. పవన్ కళ్యాణ్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడం మరో విశేషం.

మరోవైపు హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో చిత్రీకరణ ఆలస్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అలాగే హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ చిత్రాలను కూడా ఆయన పట్టా లెక్కిస్తున్నారు.