Pawan Kalyan Hari Hara Veera Mallu Delay : అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu). పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ని ఇలాంటి రోల్స్ లో కూడా చూడొచ్చా అని అభిమానులు కూడా ఆశ్చర్యపోయే రేంజ్ ప్రాజెక్ట్ ఇది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ఒకటి చిన్నది వదిలారు. ఆ వీడియో సృష్టించిన సునామీ మామూలుది కాదు. కలలో కూడా ఊహించని జానర్ లో మా పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నారు. ఈ సినిమాతో మేము కుంభస్థలం బద్దలు కొడుతాము అంటూ అభిమానులు అప్పట్లో గర్వంగా చెప్పుకునే వాళ్ళు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా పూర్తి అయ్యి థియేటర్స్ లో విడుదల అయ్యుంటే ఒక పెద్ద ప్రభంజనమే సృష్టించేది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఎన్ని సార్లు వాయిదా పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ ఏడాది ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 28 న విడుదల చేద్దామని అనుకున్నారు. అప్పటికి VFX వర్క్ పూర్తి కాకపోవడంతో మే 9 కి వాయిదా వేశారు. కానీ అప్పటికి కూడా సినిమా రెడీ గా లేకపోవడం తో జూన్ 12 న విడుదల చేస్తామని అధికారికంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా జూన్ 12 న ఈ చిత్రాన్ని తీసుకొని రావడానికి చివరి నిమిషం వరకు పోరాడారు. కానీ VFX వర్క్ డెలివరీ చేయడానికి ఇంకా వారం రోజుల సమయం పడుతుందని ఇరాన్ కి చెందిన VFX కంపెనీ చెప్పడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో పవన్ అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. అయితే వాయిదా వేయాలనే నిర్ణయం పవన్ కళ్యాణ్ నుండే వచ్చినట్టు తెలుస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని సరైన పద్దతి లో ప్రమోట్ చేయడం అత్యవసరం. అందుకు సమయం లేదు, పైగా VFX ఫైనల్ వర్క్ చేతుల్లోకి రాలేదు అంటున్నారు. హడావుడి గా వెళ్తే నష్టాలు తప్ప లాభాలు లేదు.
కాబట్టి ఈ సినిమాని వాయిదా వేయడమే మంచిది, వాయిదా వేయండి అని పవన్ కళ్యాణ్ తన నిర్మాతలతో చెప్పాడట. వాళ్ళు కూడా నిజమే కదా అని భావించి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇంత కష్టపడి సినిమా తీసినప్పుడు ప్రతీ ఫ్రేమ్ ఆడియన్స్ కి చాలా రిచ్ గా కనపడాలి, సినిమా యొక్క గ్రాండియర్ తెలియాల్సిన అవసరం ఉంది, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాని చూస్తే సూపర్ హిట్ అవ్వదు. సాధారణ ఆడియన్స్ కూడా చూడాలి, అలా సాధారణ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే రేంజ్ కంటెంట్ ఇప్పటి వరకు రాలేదు, కాబట్టి పూర్తి స్థాయి VFX వచ్చిన తర్వాత ట్రైలర్ ని విడుదల చేయండి సినిమా బిజినెస్ వేరే లెవెల్ కి వెళ్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పాడట. అంతే కాకుండా కీలక సమయంలో నిర్మాతకు భారం కాకుండా తాను గతం లో తీసుకున్న 11 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని కూడా తిరిగి ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్.