HariHara Veeramallu : 900 మందితో పవన్ కళ్యాణ్ పోరాటం.. హరిహర వీరమల్లు ఈ సీన్ తో రోమాలు నిక్కబొడవాల్సిందే

Pawan Kalyan HariHara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ రామోజి ఫిలిం సిటీ లో గత కొద్దీ రోజుల నుండి జరుగుతున్నా సంగతి తెలిసిందే..సినిమా ఇంటర్వెల్ కి సంబంధించిన భారీ పోరాట సన్నివేశం ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు..ఇందుకోసం పది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు తో సెట్టింగ్స్ కూడా వేశారు..ఈ షెడ్యూల్ మొత్తం గెడ్డం లుక్ […]

Written By: NARESH, Updated On : November 24, 2022 9:38 pm
Follow us on

Pawan Kalyan HariHara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ రామోజి ఫిలిం సిటీ లో గత కొద్దీ రోజుల నుండి జరుగుతున్నా సంగతి తెలిసిందే..సినిమా ఇంటర్వెల్ కి సంబంధించిన భారీ పోరాట సన్నివేశం ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు..ఇందుకోసం పది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు తో సెట్టింగ్స్ కూడా వేశారు..ఈ షెడ్యూల్ మొత్తం గెడ్డం లుక్ తోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు.

అభిమానులకు ఈ సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట..ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ గురించి మూవీ టీం ఈరోజు ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసింది..ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ ‘చారిత్రాత్మిక ప్రాముఖ్యం ఉన్న కథతో నాణ్యమైన చిత్రాన్ని అందించడం కోసం మేమంతా చాలా తీవ్రమైన కృషి చేస్తున్నాము..సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా వస్తుంది’ అని చెప్పొచ్చారు క్రిష్.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం కోసం సూక్షమైన వివరాలను పరిశీలించి వందలాది మంది తారాగణం తో చిత్రీకరిస్తున్నాము..అక్టోబర్ చివరి వారం షెడ్యూల్ ప్రకారం ప్రారంభించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది..పవన్ కళ్యాణ్ తో పాటుగా 900 మంది ఆర్టిస్టులు ఈ షెడ్యూల్ లో గత కొద్దీ రోజుల నుండి పాల్గొంటున్నారు..’హరి హర వీరమల్లు’ చిత్రం కేవలం పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాత్రమే కాదు..తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది..ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు పండుగ చేసుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతుందని గర్వంగా చెప్పగల్తున్నాము..వెండితెర మీద అద్భుతం సృష్టించడానికి మేము చేస్తున్న ఈ మహా ప్రయత్నం లో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ , మరియు మద్దతు ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ క్రిష్.

డిసెంబర్ చివర్లో కానీ..జనవరి మధ్యలో కానీ ఈ చిత్రం షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి మార్చి 28 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట.