Pawan Kalyan – Tarakaratna : తారకరత్నని తల్చుకొని ఏడ్చేసిన పవన్ కళ్యాణ్.. వీళ్లిద్దరి మధ్య ఇంత అనుబంధం ఉండేదా?

Pawan Kalyan – Tarakaratna : ఇండస్ట్రీ లో అజాత శత్రువుగా అందరితో ఎంతో సన్నిహితంగా మెలిగే నందమూరి తారకరత్న నిన్న తన తుది శ్వాస ని వదిలేయడం యావత్తు సినీ మరియు రాజకీయ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది.రాజకీయ పరంగా ఆయన తెలుగు దేశం పార్టీ అయ్యినప్పటికీ కూడా ఇతర పార్టీల్లో ఉన్న నాయకులూ తారకరత్న ని ఎంతో ఇష్టపడుతారు.కారణం ఆయన మంచి మనసే.తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్లగలడు తారకరత్న. […]

Written By: NARESH, Updated On : February 19, 2023 8:25 am
Follow us on

Pawan Kalyan – Tarakaratna : ఇండస్ట్రీ లో అజాత శత్రువుగా అందరితో ఎంతో సన్నిహితంగా మెలిగే నందమూరి తారకరత్న నిన్న తన తుది శ్వాస ని వదిలేయడం యావత్తు సినీ మరియు రాజకీయ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది.రాజకీయ పరంగా ఆయన తెలుగు దేశం పార్టీ అయ్యినప్పటికీ కూడా ఇతర పార్టీల్లో ఉన్న నాయకులూ తారకరత్న ని ఎంతో ఇష్టపడుతారు.కారణం ఆయన మంచి మనసే.తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్లగలడు తారకరత్న.

అంతే కాకుండా ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యడం లో కూడా ఎప్పుడు ముందు ఉండే వ్యక్తి ఆయన.తానూ నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి అయ్యినప్పటికీ కూడా మిగిలిన వాళ్లందరినీ తన సొంత కుటుంబం లాగ భావించడం తారకరత్న కి ఉన్న గొప్ప లక్షణం.అలా మెగా ఫ్యామిలీ కుటుంబం తో కూడా తారకరత్న కి ఎంతో సాన్నిహిత్యం ఉంది.ముఖ్యం గా పవన్ కళ్యాణ్ తో తారకరత్న కి ఎంతో మంచి అనుబంధం ఉంది.

పవన్ కళ్యాణ్ ని తానూ చిన్నప్పటి నుండి బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచేవాడిని అంటూ తారకరత్న గతం లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో తెలిపాడు కూడా.తనని అంతటి ఆప్యాయంగా పిలిచే తారకరత్న చనిపోవడం పై పవన్ కళ్యాణ్ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్త పరిచాడు.ఆయన మాట్లాడుతూ ‘తారకరత్న గారు చనిపోవడం నా మనసుని ఎంతో దిగ్బ్రాంతి కి గురి చేసింది.ఎప్పుడు కలుసుకున్న బాబాయి అంటూ ఎంతో ప్రేమగా పలకరించేవాడు.ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ సమర్థవతంగా ముందుకు సాగేవాడు.ఈమధ్యనే ఆయన రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు తెలుగు దేశం పార్టీ లోకి అడుగుపెట్టాడు.తన లక్ష్యాలను చేరుకోకముందే ఇలా జరగడం అనేది నాకు ఎంతో బాధని కలిగించింది.ఆయన భార్య బిడ్డలకు, తండ్రి మోహన్ కృష్ణ గారికి, బాబాయి బాలకృష్ణ గారికి మరియు ఇతర కుటుంబ సబ్యులకు ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు.