
Taraka Ratna : గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ నందమూరి తారకరత్న కన్నుమూశాడు. దాదాపు 22 రోజులు అతను ఎక్మో మిషన్ మీదనే ఉన్నాడు. గుండె పోటు తీవ్రంగా రావడంతో కాలేయం, గుండెను పని చేయించడానికి ఈ యంత్రాన్ని వాడతారు.. కోవిడ్ ఇది బహుళ ప్రాచుర్యం లోకి వచ్చింది.. అప్పట్లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇదే యంత్రాన్ని వాడారు. కానీ వయోభారం వల్ల, అవయవాలు సహకరించకపోవడం వల్ల వారు కన్నుమూశారు. తారకరత్న విషయంలోనూ ఇదే జరిగింది.. అయితే ఇక్కడ తారకరత్న వయసు 40 ఏళ్లలోపే కావడం గమనార్హం.
గుండెపోటుకు గురైనప్పుడే తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సుమారు గంటసేపటి దాకా అతడికి మెరుగైన వైద్యం అందలేదు. ఒకవేళ అదే సమయంలో వైద్యం అంది ఉంటే తారకరత్న బతికి బట్ట కట్టేవాడు. కుప్పం నుంచి బెంగళూరు తీసుకొచ్చేదాకా గోల్డెన్ అవర్ మించి పోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పటికీ వైద్యులు ఒక రోజు గడిచిన తర్వాత తారకరత్నకు ఎక్మో యంత్రం ద్వారా గుండె, కాలేయం పనిచేసేలా చేశారు. కానీ ఇక్కడ మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం, ఎన్ని మందులు వాడినప్పటికీ శరీరం సహకరించకపోవడంతో తారకరత్న 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. తారకరత్న ను బతికించేందుకు విదేశాల నుంచి వైద్య నిపుణులను కూడా రప్పించారు. ఖరీదైన మందులు కూడా వాడారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మెదడు పూర్తి అచేతనంగా మారిపోవడంతో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు.
ఏమిటి ఈ ఎక్మో
ఎక్మో అనేది కోవిడ్ సమయంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. కోవిడ్ 19 రోగులకు చికిత్స సమయంలో దీనిని వాడారు..ఎక్మో అంటే ఎక్ట్రా కార్పో రియల్ మెంబ్రేన్ ఆక్సిజన్( ఈసీఎంవో).. అంటే కృత్రిమంగా గుండె, కాలేయానికి సపోర్ట్ అందించడం. ఇక ఎక్మో లో రెండు రకాలు ఉన్నాయి. అలాగని ఎక్మో ను మిరాకిల్ క్యూర్ అనుకోవద్దని అంటున్నారు వైద్యులు. ఇతర పద్ధతుల్లో గుండె,కాలేయం విఫలమై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ టెక్నాలజీ ద్వారా సపోర్టు అందిస్తారు. ఈ పద్ధతిలో శరీరం నుంచి బ్లడ్ తీసుకొని ఒక మిషన్ సహాయంతో రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను తొలగించి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అందజేస్తారు. కోవిడ్ సమయంలో న్యూ మోనియా బాధ పడుతూ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ క్రమబద్దీకరణకు వెంటిలేషన్ సరిపోని రోగులకు దీనిని వాడేవారు. ఎక్మో ను మిరాకిల్ క్యూర్ అనుకోవద్దు. వెంటి లేషన్ ఫెయిల్ అయినా కూడా ఇంకా ఓ భరోసా ఉంది అని అనుకోవడం మాత్రమే.