pawan kalyan birthday special song : ఒక పవనమై.. పిడికిలై.. సేనవై.. రా.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. అంటూ పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్స్ తయారు చేసిన ఈ బర్త్ డే పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకసందర్భంలో వాడిన ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అన్న థీమ్ తోనే ఆయన రాజకీయ పోరాటాన్ని కళ్లకు కడుతూ ఈ పాట సాగింది.
ఇందులోని అద్భుతమైన స్ఫూర్తినిచ్చే పదాలు పాటకు మరింతగా ప్రాచుర్యాన్ని తెచ్చాయి. అచ్చం ఓ సినిమా పాటకు తగ్గకుండా కొందరు అభిమానులు తయారు చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమరావతి రైతుల కోసం పోలీసులతో ఫైట్ చేసిన పవన్ కళ్యాణ్ వీరావేశాన్ని.. బాధితులను ఆదుకున్న వీడియోలను.. రైతులతో కలిసి పాదయాత్ర చేసింది.. విశాఖ మన్యంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన వీడియోలను ఇందులో పొందుపరిచారు.
https://www.youtube.com/watch?v=HfOE8R0BAxA
ఇక సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అన్న వీరావేశ డైలాగ్ ను.. ‘చొక్కా విప్పి గుండెల్ని చూపిస్తాం’ అని తొడగొట్టిన సందర్భాన్ని…. మడమ తిప్పం.. తాటా తీసి మోకాళ్లపై కూర్చుండబెడుతాం’ అని హెచ్చరించిన వీడియోలను కట్ చేసి అత్యద్భుతంగా వీడియోను తయారు చేశారు. లిరిక్స్, వీడియోలు, పాట పాడిన విధానం, సంగీతం అంతా పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కానుకగా ఈ సాంగ్ ను తీర్చిదిద్దారు. పవన్ కు అసలు సిసలు శుభాకాంక్షలను దీంతో చెప్పారు.