https://oktelugu.com/

Pawan Kalyan Ustad Bhagat Singh : రీమేక్ కాదు..’ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ వింటే ఫ్యాన్స్ కి పూనకాలే

Pawan Kalyan Ustad Bhagat Singh  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. మూడేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు..ఆ మూవీ స్టోరీ ని మొత్తం మార్చేసి ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’ ని కాస్తా ‘ఉస్తాద్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2022 / 02:03 PM IST
    Follow us on

    Pawan Kalyan Ustad Bhagat Singh  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. మూడేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు..ఆ మూవీ స్టోరీ ని మొత్తం మార్చేసి ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’ ని కాస్తా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మార్చారు.

     

     

    పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ దగ్గర నుండి సెలబ్రిటీస్ వరుకు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు.. అంతటి క్రేజీ కాంబినేషన్ ఇది..అలాంటి ప్రాజెక్ట్ నుండి ఏ చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా తట్టుకోలేరు ఫ్యాన్స్.. మూడు రోజుల క్రితం అదే జరిగింది.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ రీమేక్ మూవీ అని.. తమిళం లో 7 ఏళ్ళ క్రితం వచ్చిన విజయ్ సూపర్ హిట్ చిత్రం ‘తేరి’కి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి.

    ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ కి చుక్కలు చూపించడం ప్రారంభించారు..సోషల్ మీడియా మొత్తం ‘తేరి రీమేక్ ని ఆపాలి’ అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నెగెటివ్ ట్రెండ్ చేసారు.. హరీష్ శంకర్ పక్కనే ఉంటే కొట్టేసేవాళ్ళు ఏమో.. అంత కోపం చూపించారు..కానీ వాస్తవానికి ఇది ‘తేరి’ రీమేక్ కాదు..కేవలం ఆ లైన్ ని తీసుకొని స్టోరీ మొత్తం మార్చి డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఇది..ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా.. ప్రొఫెస్సర్ గా నటించబోతున్నాడు.

    సినిమాలో ఉండే పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన గెటప్స్ ఫ్యాన్స్ కి పండుగ చేసుకునే విధంగా ఉంటుందట.. షూటింగ్ మొత్తం ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లోనే సాగనుంది.. జనవరి నెలలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. వాస్తవానికి ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ స్టోరీతోనే షూటింగ్ ప్రారంభిద్దాం అనుకున్నారు.. కానీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది కానీ, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ అసలు నచ్చలేదు అట..మార్పులు చేర్పులు చేసినా కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు..అప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరమీదకి వచ్చింది.. హరీష్ శంకర్ ఒక సవాలుగా తీసుకొని ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు..కచ్చితంగా మరో గబ్బర్ సింగ్ గ్యారంటీ అని యూనిట్ బలమైన నమ్మకం తో ఉంది.