Pawan- Hyper Aadi : హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ ఖాయమే. ఈ స్టార్ కమెడియన్ మొదట్నుంచి జనసేన సానుభూతిపరుడిగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆది జనసేన పార్టీ కోసం క్యాంపైన్ చేస్తూ ఉంటారు. పలుమార్లు జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన మీద ఈగ వాలనీయడు, మాటపడనీయడు. ప్రత్యర్థులకు తనదైన శైలిలో చురకలు వేస్తూ ఉంటాడు. పవన్ ని విమర్శించిన వారిపై జబర్దస్త్ స్కిట్స్ లో సెటైర్స్ వేస్తారు. ఇటీవల రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో హైపర్ ఆది మాట్లాడారు.

ఆయన స్పీచ్ జనసైనికుల్లో ఉత్సాహం, ఉత్తేజం నిపింది. జనసేన పార్టీలో హైపర్ ఆది కీలక నేతగా ఎదుగుతాడనే విశ్వాసం ఎప్పటి నుంచో ఉంది. కాగా 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో హైపర్ ఆది పోటీకి దిగుతునట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారట. ఆయన నియోజకవర్గం కూడా కన్ఫర్మ్ అయిపోయిందట. హైపర్ ఆది ప్రకాశం జిల్లాకు చెందినవాడు. ఈ క్రమంలో అక్కడే ఆయనకు సీటు కేటాయిస్తున్నారట.
విశ్వసనీయ సమాచారం ప్రకారం దర్శి నియోజకవర్గం నుండి హైపర్ ఆది పోటీ చేయడం ఖాయం అంటున్నారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి హైపర్ ఆదిని పోటీ చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశించారట. ఇప్పుడి టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. జనసేన క్షేత్రస్థాయిలో ఎన్నికలకు సిద్ధం అవుతుంది. తమ కేడర్ ని సమాయత్తం చేస్తుంది. గత పరాజయాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పక్కా ప్రణాళికతో వెళుతున్నారు.
మరోవైపు టీడీపీ-జనసేన పొత్తు అనివార్యం అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జనసేన అధినేత తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా మాకు శిరోధార్యం అని జనసైనికులు అంటున్నారు. కాగా హైపర్ ఆది వంటి నిజాయితీగల జనసేన కార్యకర్తలను గుర్తించడం గొప్ప పరిణామం. వచ్చే ఎన్నికల్లో పదుల సంఖ్యలో సామాన్యులు జనసేన పార్టీ తరపున పోటీ చేసే సూచనలు కలవు .