Surya and Ishan : టీమిండియాలో కొత్త ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. పరుగుల దాహం తీర్చుకుంటున్నారు. ఫలితంగా మంచి ఫామ్ కొనసాగిస్తున్నారు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తమదైన శైలిలో బ్యాట్లకు పని కల్పిస్తున్నారు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడుతున్నారు. ఇన్నాళ్లు పరిమిత ఓవర్ల మ్యాచులకే పరిమితమైన వారు ప్రస్తుతం టెస్టులకు కూడా ఎంపిక కావడంతో ఇక వారి తడాఖా చూపించనున్నారు.

ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసి తన సత్తా చాటాడు. ఇక మీదట వీరు టెస్టుల్లో కూడా మంచి ప్రదర్శన కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇద్దరు కలిసి పరుగుల వరద పారిస్తున్నారు. గత ఏడాది టీ20 ఫార్మాట్ లో వీరి దూకుడు కొనసాగించడం గమనార్హం.
సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఎంపికతో టీమిండియా మరింత పటిష్టంగా మారనుంది. టీ20లకు ఆడుతున్న వీరు టెస్టులకు సెలెక్టు కావడంతో టీమిండియాకు బలంగా తయారు అవుతుందని ఆకాంక్షిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. టెస్టులకు వీరిద్దరు ఎంపిక కావడం ఇదే తొలిసారి. టెస్టుల్లో కూడా తమ ఫామ్ కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు. దీంతో భవిష్యత్ లో జట్టు మరింత బలోపేతం అయి మంచి విజయాలు అందుకోనుందని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా విజయాల పరంపర కొనసాగించనుందా అని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇద్దరు మంచి నైపుణ్యంతో పరుగులు రాబట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, పూజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేజా, షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనాద్కట్, సూర్య కుమార్ యాదవ్ లను ఎంపిక చేశారు.