Karimnagar Hospital News: సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని నమ్ముతారు. సంగీతానికి అంత మహత్తు ఉంటుందని తెలిసిందే. అలాంటి సంగీతంతో రోగాలు కూడా పోగొట్టవచ్చని వారు తెలుసుకున్నారు. ఇంకేముంది తమదైన శైలిలో వైద్యం మొదలెట్టారు. ఫలితం సాధించారు. రోగికి రోగం నయం చేశారు. దీంతో వారిని అందరు ప్రశంసించారు. ఇకపై అలాంటి వైద్యమే చేయాలని చెబుతున్నారు. డాక్టర్లు సంగీత కళాకారులుగా అవతారమెత్తి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని మామూలు మనిషిని చేశారు.

దీనికి కరీంనగర్ లోని ఓ ఆస్పత్రి వేదికైంది. అందులో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ కాలేయ సంబంధ వ్యాధితో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇరవైఐదు రోజులుగా వైద్యం అందిస్తుండటంతో కళ్లు తెరవడం, కాళ్లు కదపడం లాంటివి చేస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అతడిలో కదలికలు రావాలని నర్సులు సినిమా పాటలతో డాన్సులు చేయడంతో అతడిలో మూమెంట్ రావడం ఆరంభమైంది.
Also Read: శనిదోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారా.. శుభం కలగాలంటే చేయాల్సిన పనులివే?
దీంతో ఇదేదో బాగుందని రోజు చేయడం మొదలు పెట్టారు. దీంతో శ్రీనివాస్ మానసిక ధృడత్వం రావడం ప్రారంభమైంది. సంగీతంతో రాళ్లయినా కరుగుతాయనే సామెతను నిజం చేస్తూ రోగికి వ్యాధి నయం కావడం అతడిలో మెల్లగా మార్పు రావడం కనిపించడంతో పేషెంట్ ను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. నర్సులు చేసిన డాన్సులు పేషెంట్ లో మంచి స్పందన కలిగించాయని తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నర్సులు తీసుకున్న నిర్ణయంతో రోగి మామూలు మనిషి కావడం చూస్తుంటే ఇకపై అందరికి ఇలాంటి వైద్యమే చేయాలని చూస్తున్నారు. పేషెంట్ లో కదలికలు తెచ్చే ఉద్దేశంతోనే నర్సులు ఈ మేరకు నృత్యములు చేస్తూ అతడి మెదడును చురుకుగా చేయించడంతో వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమ వాడికి నయం చేయించినందుకు యాజమాన్యంపై నమ్మకం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నిర్వాకంతో విమర్శలకు బదులు ప్రశంసలు కురవడంతో అందరు ఊపిరి పీల్చుకుంటున్నారు
Also Read: రాత్రి 9 తర్వాత భోజనం తింటున్నారా.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!