Marriages in China:ఈడంత పోయినాక పెళ్లమెందుకు.. ఆకలి అంత పోయినాక అన్నమెందుకు అనేది సామెత. ఈడంతా పోతే ఓపిక పోతోంది. ఆకలి పోతే అన్నం తినాలనిపించదు. ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో జరగాలి. అప్పుడే జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉంటుందని తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చైనాలో వివాహాలు చేసుకోవడానికి యువత ముందుకు రావడం లేదు. ఫలితంగా జనాభా తగ్గిపోతోంది. దీనిపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు ఒక్కరే ముద్దు అని ప్రకటించినా ఇప్పుడు ఇద్దరు కనొచ్చని అనుమతి ఇచ్చినా పెంచడం భారమనే ఉద్దేశంతో చాలా మంది ఒక్కరికికే ఫిక్స్ అయిపోతున్నారు.

దేశ జనాభాలో అరవై ఏళ్లకు పైబడిన వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దీంతో పిల్లల సంఖ్య తగ్గుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు అడ్డుగోడలా మారుతోంది. దీనిపై దేశమే ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత మూడేళ్లుగా యువత పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా పెళ్లి ఖర్చులు, కన్యాశుల్కాలు పెరిగిపోతున్నాయి. పిల్లలను పెంచడానికి ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతన్న సందర్భంలో యువత పిల్లలను కనేందుకు కూడా వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో 26 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా గత మూడేళ్లుగా 33 ఏళ్లు దాటినా యువత పెళ్లి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో సంసారం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో పిల్లలను కనే వయసు కూడా దాటిపోతోంది. ఈ పరిణామాలు దేశానికి చేటు తెచ్చేవిగా ఉంటున్నాయి. దీనిపై ఆందోళన కూడా వస్తోంది. గతంలో 1.2 కోట్ల మేర జననాలు పెరిగినా ప్రస్తుత సమయంలో 5 లక్షలకన్నా జనాభా తక్కువగా పెరగడం చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.
2001లో 76.3 లక్షల జంటలు పెళ్లిళ్లు చేసుకోగా 2019లో కోటి జంటలు వివాహం చేసుకున్నాయి. 2020లో మాత్రం 90 లక్షల కన్నా తక్కువ జంటలు వివాహం చేసుకోవడం గమనార్హం. 2021లో 80లక్షల కన్నా తక్కువ జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. ఈ వివరాలు చూస్తుంటే మతిపోతోంది. ఇంత తక్కువ సంఖ్యలో వివాహాలు చేసుకుంటుంటే ఇక జననాలు ఎలా పెరుగతాయనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో చైనా దేశంలో వివాహిక జీవితం ఖరీదుగా మారిపోతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. యువత ఇలా తప్పించుకుంటు తిరుగుతూ పెళ్లిళ్లు చేసుకునేందుకు మాత్రం వెనకాడటం ఆశ్చర్యకరమే.