Homeట్రెండింగ్ న్యూస్Passport: ఇంట్లో నుంచే పాస్‌పోర్ట్ అప్లై చేయండి.. ఈజీ స్టెప్స్ మీ కోసమే!

Passport: ఇంట్లో నుంచే పాస్‌పోర్ట్ అప్లై చేయండి.. ఈజీ స్టెప్స్ మీ కోసమే!

Passport: పాస్‌పోర్ట్ అనేది అంతర్జాతీయంగా మీ గుర్తింపును కన్ఫాం చేసే ఓ ప్రయాణ పత్రం. ఇది ఒక దేశ ప్రభుత్వం తన పౌరులకు జారీ చేస్తుంది. తద్వారా వారు ఇతర దేశాలకు చట్టబద్ధంగా ప్రయాణించగలరు. పాస్‌పోర్ట్ మీ జాతీయతను, గుర్తింపును నిర్ధారిస్తుంది. నేటి ప్రపంచంలో విదేశాలకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరికీ పాస్‌పోర్ట్ ఒక అవసరం అయిన డాక్యుమెంట్.

నేటి డిజిటల్ యుగంలో పాస్‌పోర్ట్ పొందడం చాలా ఈజీ అయిపోయింది. మీరు ఇంట్లో కూర్చొన్ని ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ ఎలా దరఖాస్తు చేయాలో.. దీనికి ఏ డాక్యుమెంట్లు అవసరమో ఈ కథనంలో తెలుసుకుందాం. దీని తరువాత ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లడానికి సులభంగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
దీని కోసం ముందుగా పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. దీని కోసం మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. passportindia.gov.in. వెబ్‌సైట్‌కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఖాతా లేకపోతే Register Now ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ప్రాథమిక వివరాలను నింపండి.. ఖాతాను క్రియేట్ చేయాలి. ఖాతా సృష్టించిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. ఆ తర్వాత పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయండి. దీని కోసం Apply for Fresh Passport లేదా Re-issue of Passport ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఇక్కడ ఫారమ్ నింపడానికి ఇస్తారు. మీ పర్సనల్ వివరాలు పేరు, పుట్టిన తేదీ, చిరునామా అన్నీ సరిగ్గా నింపండి. అడిగిన అన్ని అవసరమైన డాక్యుమెంట్‌లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. ఇది చేసిన తర్వాత మీ సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ తేదీ, సమయాన్ని ఎంచుకోండి. మీరు డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. మీరు ఏ పద్ధతి ద్వారా చెల్లించాలనుకుంటే దానిని సెలక్ట్ చేసుకోవాలి. అపాయింట్‌మెంట్ రోజున సమయానికి పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి చేరుకుని వెరిఫికేషన్ చేయించుకోండి. మీ అన్ని డాక్యుమెంట్‌లను తప్పకుండా మీతో తీసుకెళ్లాలి.

అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో మీ అవసరమైన డాక్యుమెంట్‌లను మీతో తీసుకెళ్లాలి. దీనివల్ల పైన చెప్పిన ప్రాసెస్ మీకు సులభంగా, తక్కువ సమయంలో పూర్తవుతుంది. దీని కోసం గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి), చిరునామా రుజువు (విద్యుత్ బిల్లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా రేషన్ కార్డ్ లేదా పాస్‌బుక్) అవసరం. దీనితో పాటు పుట్టిన తేదీ సర్టిఫికేట్ (10వ తరగతి మార్క్ షీట్), వివాహితుల కోసం వివాహ ధృవీకరణ పత్రం (పేరు మార్చినట్లయితే), NOC (మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే), నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అవసరం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular