Keerthy Suresh Marriage: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ముఖ్యంగా పెళ్లి సమయానికి చేసుకోవాలి. అప్పుడే పిల్లలు కనడానికి, వాళ్ళను పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయడానికి ఓపిక, వయసు ఉంటాయి. జనరేషన్స్ మారే కొద్ది వివాహ వయసు వెనక్కి పోతుంది. బాల్య వివాహాల దశ నుండి ఇండియన్ కల్చర్ ఏజ్ బార్ మ్యారేజెస్ దశకు చేరుకుంది. 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటున్న వారు చాలా అరుదైపోయారు. ఇక గ్లామర్ ఫీల్డ్ లో సరేసరి. నాలుగు పదుల వయసొచ్చినా కొందరు పెళ్లి మాటెత్తడం లేదు. తామేదో స్వీట్ సిక్స్టీన్ లో ఉన్నట్లు అప్పుడే పెళ్లా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

అయితే హీరోయిన్ కీర్తి సురేష్ విషయంలో ఆమె పేరెంట్స్ జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటికే కీర్తికి 30 ఏళ్ళు రాగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. వీలైనంత త్వరగా వివాహం చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఒక అబ్బాయిని కూడా చూశారట. కీర్తి సురేష్ కి ఆ అబ్బాయి నచ్చడంతో ఆమె సైతం సై అనగా త్వరలో పెళ్లి భాజా మోగనుందన్న ప్రచారం గట్టిగా నడుస్తుంది. అలాగే కీర్తి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారట. ఆల్రెడీ చేస్తున్న సినిమాలు పూర్తి చేసి తెరమరుగు కానున్నారట.
ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఒకింత నిరాశ చెందుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ నటన కొనసాగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ పెళ్లి పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే గతంలో ఇలాంటి పుకార్లు వినిపించాయి. దీంతో ఇది గాలి వార్తా లేక నిజం ఉందా? అనే చర్చ జరుగుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నారు.

హీరో నానికి జంటగా దసరా చిత్రంలో నటిస్తున్నారు. వెన్నెల అనే పల్లెటూరి అమ్మాయిగా కీర్తి డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అలాగే చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేయడం విశేషం. పెద్దన్న మూవీలో కీర్తి రజనీకాంత్ చెల్లెలు పాత్ర చేశారు. ఒక స్టార్ హీరోయిన్ హోదాలో ఉండి కీర్తి సిస్టర్ రోల్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటితో పాటు మరో రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.