
Valentine Day OYO: వాలెంటైన్స్ డే వచ్చిందంటే ఓయో హోటల్స్ మరియు పార్క్స్ మొత్తం ప్రేమికులతో కిక్కిరిసిపొయ్యే సందర్భాలు గతం లో మనం ఎన్నో చూసాము.గత ఏడాది అయితే ‘ఓయో’ యాప్ లో రికార్డు స్థాయిలో హోటల్స్ రూమ్స్ బుక్ అయ్యాయి.ఆ రేంజ్ లో ఉంటుంది ప్రేమికుల దినంనాడు.కానీ ఈ ఏడాది మాత్రం అందులో పావు శాతం కూడా లేదనే చెప్పాలి.
ముఖ్యం గా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లాంటి ప్రాంతాలు జనాలు లేక వెలవెలబోయాయి,దానికి కారణం ఇటీవలే ఇండియా లో పుట్టుకొచ్చిన కొన్ని సంఘాల వల్లే అని తెలుస్తుంది.ఈమధ్య ‘భజరంగ్ డాల్’ వంటి సంఘాలు ప్రేమికులు తిరుగుతుండే ప్రాంతాలకు వెళ్లి వాళ్ళ చేతికి తాళి ఇచ్చి బలవంతంగా పెళ్లిళ్లు చేసిన సందర్భాలు ఎన్నో మనం చూసాము.ఆ సంఘాల బెడద వల్లే ప్రేమికులు ఈసారి బహిరంగ ప్రాంతాలలో అడుగుపెట్టలేదని తెలుస్తుంది.

అయితే ఈసారి ప్రేమికులు ఎక్కువగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానే వైలెంటైన్స్ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారని ఒక ప్రముఖ ఏజెన్సీ రిపోర్టు ద్వారా తెలిసింది.ప్రతీ ఏడాది లాగ, ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజు ‘భజరంగ్ డాల్’ సంఘం తరుపున జరిగిన పెళ్లిళ్లు చాలా తక్కువని తెలుస్తుంది.అంటే దీని అర్థం ప్రేమికులు 90 శాతం ఈసారి పార్కుల వెంట, లేదా ఓయో హోటల్స్ వెంటపడలేదని.