Belgium: అదృష్టమంటే అదేనేమో. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెబుతుంటారు. కానీ కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. కానీ పట్టుదల ఉంటే సాధించనిది ఏదీ ఉండదు. మనం అనుకోవాలే కానీ మనం పట్టుకున్నదల్లా బంగారంగా మారుతుంది. ప్రతిసారి దురదృష్టం వెంటాడదు. కొన్ని సార్లు అదృష్టం కూడా పలకరిస్తుంది. ఆ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. అంతవరకు వారంతా సాధారణ జీవితం గడిపినా ఒక్కసారిగా ధనవంతులుగా మారారు.

వారి అదృష్ట రేఖ ఒక్కసారిగా పెరిగింది. దాదాపు 165 మంది ఖాతాల్లో కోట్లాది రూపాయలు పడటంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7.50 కోట్లు జమయ్యాయి. వినడానికి ఇదో సినిమా కథలా ఉన్నా వాస్తవమే. నిజంగా జరిగిందే. దీంతో దీని గురించి తెలుసుకోవాలనే ఆతృత అందరిలో రావడం సహజమే. వారికి ఎందుకు అంత మొత్తంలో ధనం వచ్చిందనే దానిపై అందరు ఆలోచనలో పడుతున్నారు. వారి అదృష్టం ఎలా మారిందనే దానిపై ఆసక్తి పెరుగుతోంది.
బెల్జియం దేశంలోని బాలెన్ మున్సిపాలిటీలో ఆల్మెన్ అనే గ్రామం ఉంది. ఇక్కడ 2001 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 3100 జనాభా నివసిస్తోంది. గ్రామానికి చెందిన 165 మంది ఒక్కొక్కరు చందాలు వేసుకుని యూరోమిలియన్ లాటరీ టికెట్ కొనుక్కున్నారు. తాజాగా మంగళవారం తీసిన డ్రాలో వీరి టికెట్ కు లక్ తగిలింది. ఏకంగా రూ.1200 కోట్లు బహుమతి గెలుచుకున్నారు. దీంతో వారు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కసారిగా అంత మొత్తంలో డబ్బు రావడంతో అందరు హర్షం వ్యక్తం చేశారు.

గత కొన్నేళ్లుగా తాము టికెట్ కొంటున్నా రాని అదృష్టం ఇప్పుడు రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7.50 కోట్లు జమకావడంతో వారి కళ్లల్లో ఆనందభాష్పాలు కారుతున్నాయి. ఒక్క రాత్రిలో తమ తలరాత మారిందని చెబుతున్నారు. వారంతా కోటీశ్వరులయ్యారు. దీన్ని బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ గా అభివర్ణిస్తున్నారు. తమకు కలిగిన అదృష్టానికి పొంగిపోతున్నారు. పోయిన దాన్ని తిరిగి సాధించుకున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదృష్టమంటే వారిదే అని చెబుతున్నారు.