https://oktelugu.com/

Ori Vaari – Lyrical Video : ఓరి వారి నీది కాదురా పోరి: కీర్తి సురేష్ తో నాని లవ్ బ్రేకప్

Ori Vaari : కీర్తి సురేష్, నాని జంటగా రూపొందుతున్న చిత్రం దసరా. పూర్తి తెలంగాణ యాసతో కోల్ బెల్ట్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇప్పటికే విడుదలైన ధూమ్ ధాం పాట ప్రేక్షకులను అలరించింది.. ఇప్పుడు ఈ సినిమాలో ఓరి వారి అనే పేరుతో శ్రీమణి రాసి, సంతోష్ నారాయణ్ పాడిన పాట విడుదలైంది..ఇది కూడా తెలంగాణ మాండలికంలోనే సాగింది. ఓరి వారి […]

Written By:
  • Rocky
  • , Updated On : February 13, 2023 / 10:07 PM IST
    Follow us on

    Ori Vaari : కీర్తి సురేష్, నాని జంటగా రూపొందుతున్న చిత్రం దసరా. పూర్తి తెలంగాణ యాసతో కోల్ బెల్ట్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇప్పటికే విడుదలైన ధూమ్ ధాం పాట ప్రేక్షకులను అలరించింది.. ఇప్పుడు ఈ సినిమాలో ఓరి వారి అనే పేరుతో శ్రీమణి రాసి, సంతోష్ నారాయణ్ పాడిన పాట విడుదలైంది..ఇది కూడా తెలంగాణ మాండలికంలోనే సాగింది.

    ఓరి వారి నీది కాదురా పోరి అని ప్రారంభమైన ఈ గీతం నాని విరహాన్ని సూచిస్తోంది.. కీర్తి సురేష్ నాని ప్రేమను తిరస్కరించిన నేపథ్యంలో ఈ పాట వస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.. ఈ పాటను శ్రీమణి రాసిన విధానం, సంతోష్ పాడిన విధానం అద్భుతంగా ఉన్నాయి.. ఒక విరహ గీతాన్ని ఇలా కూడా రాయొచ్చా, ఇలాకూడా పాడొచ్చా అనే విధంగా దీనిని మలిచారు.

    ఇక నానికి విరహ గీతాలు కొత్తేమీ కాదు.. కృష్ణగాడి వీర ప్రేమ గాధ, నిన్ను కోరి, జెర్సీ వంటి చిత్రాల్లో మనసును హత్తుకునే విరహ గీతాలు ఉన్నాయి.. ఆ సినిమాలు ప్రేమ కథ నేపథ్యంలో తీసినవి. కాబట్టి విరహం ఉంటుంది. కానీ దసరా సినిమాలో నాని పూర్తి లుక్ లో ఉన్నాడు. అప్పట్లో విడుదలైన టీజర్ లో ఏ మాత్రం కూడా ప్రేమ కథ చాయలు కనిపించలేదు.. అయితే కీర్తి సురేష్ కు, నానికి లవ్ సీన్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.. మరి ఇందులో ఎటువంటి ప్రేమ కథ చొప్పించారో సినిమా విడుదల అయ్యేదాకా తెలియదు.. కానీ మొత్తానికి తెలంగాణ మాండలికంలో రాసిన ఈ పాట బాగుంది.