Rushikonda Green Matt : పచ్చని గుట్టను చెదపురుగులా తొలవడం అంటే ఇదే కాబోలు. అది కూడా ఆ చెట్ల ఆనవాళ్లు లేకుండా… అసలు ఇది ఒకప్పటి కొండేనా అని భ్రమ పడేలా. ఎవరి మాటా వినడో, లేక తనకు తానే గొప్ప అనుకుంటాడో తెలియదు కానీ.. జగన్ చేసే వన్నీ కూడా వినాశకమైన పనులే. లేకుంటే అమరావతి మొదలుపెట్టి మూడు రాజధానులు అన్నాడు. కోర్టు తిడితే యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు విశాఖపట్నం నేను వెళ్తున్న అని అంటున్నాడు. అంతకుముందే తన అనుచరులు విశాఖపట్నంలో వాలిపోయారు. పరవాడ నుంచి రిషికొండ వరకు చెరబట్టారు. ఎక్కడికక్కడ హద్దులు పాతారు. ఆక్రమించుకుంటూ వెళ్లారు. అప్పట్లో అమరావతికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని ఆరోపించిన జగన్ మోహన్ రెడ్డి… ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్నది ఏమిటి? ఆయన అనుచరులు సాగిస్తున్న భూ దందా మాటేమిటి? ఒకటా రెండా వందల ఎకరాలు అన్యాక్రాంతమైపోయాయి.. సొసైటీల భూములు కూడా అధికార పార్టీ నాయకుల చేతిలోకి వెళ్లిపోయాయి.
కొండలను తొలవడమే కాదు. వాటి చుట్టూ ఉన్న పచ్చని చెట్లను కూడా నేలమట్టం చేయడంలో అధికార పార్టీ నాయకులు సిద్ధహస్తులై పోయారు. ఆ మధ్య జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనకు వెళ్లే క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని పచ్చని చెట్లను నిలువునా నరికేశారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఇతరులకు కనిపించకుండా ఉండేందుకు చుట్టూ పచ్చని పరదాలు కట్టారు. ఒకవేళ హిట్లర్ ఇప్పుడు బతికి ఉంటే కనుక ఇతగాడి విపరీత బుద్దులను చూసి ఉరేసుకుని చచ్చేవాడు. గడాఫీ గనక జీవించి ఉంటే నుయ్యో గుయ్యో చూసుకునేవాడు.. ప్రజల చేత ఓట్లు వేయించుకొని, ప్రజలకు ముఖం చూపించకుండా పర్యటన సాగించడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం? ఏ మడమతిప్పని, మాట తప్పని నినాదాలకు తార్కాణం.. ప్రచార ఆర్భాటమో, ఇంకొకటో తెలియదు కానీ… నాటి చంద్రబాబే నయం అన్పించేలా జగన్ చేస్తున్నాడు.
ఇక విశాఖపట్నం రిషికొండకు సంబంధించి అభివృద్ధి పేరుతో దాని చుట్టూ ఉన్న చెట్లను మొత్తం నరికేశారు . ఆ గుట్ట చుట్టూ ఉన్న మట్టిని చదివిస్తున్నారు. ఫలితంగా దాని ఆకారమే మారిపోయింది.. చూస్తూ ఉంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ హెయిర్ స్టైల్ మాదిరి కనిపిస్తోంది. అప్పట్లో జగన్ పర్యటనను పురస్కరించుకొని రిషికొండను చదును చేసిన ప్రాంతాల్లో పచ్చని పరదాలు అధికారులు కప్పారంటే వారిపై ఏ స్థాయికి వెళ్లి పోయిందో అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై సెటైరికల్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి..