
Orange Re Release Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం మామూలు ఊపులో లేరు. #RRR చిత్రం తో గ్లోబల్ వైడ్ గా ఎవరికీ సాధ్యపడని క్రేజ్ ని దక్కించుకున్న రామ్ చరణ్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. అయితే రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరెంజ్ స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేసారు.రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రమైన ‘ఆరెంజ్’ కి జనాలు ఏమి వస్తారు లే అని అందరూ అనుకున్నారు.
కానీ ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ చిత్రానికి నేడు వచ్చిన వసూళ్లు కొంత మంది స్టార్ హీరోల సూపర్ హిట్ రీ రిలీజ్ లకు కూడా రాలేదని తెలుస్తుంది.హైదరాబాద్ , వైజాగ్, సీడెడ్ , నెల్లూరు ఇలా అన్నీ ప్రాంతాలలో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోయారు.
వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.ఇది వరకు పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు సినిమాలకు మినహా ఏ హీరో కి కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. ఓవర్సీస్ లో ఈమధ్య రీ రిలీజ్ లను బ్యాన్ చేసారు,లేకపోతే అక్కడ కూడా ఈ సినిమాకి మరో 30 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

కర్ణాటక మరియు చెన్నై వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి ఓపెనింగ్ అదిరిపోయింది. అయితే వచ్చిన డబ్బులు మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి డొనేట్ చేయబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాత నాగబాబు ఇదివరకే మీడియా కి చెప్పాడు.కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ కి 80 లక్షల షేర్ వసూళ్లు వస్తాయి. ఆ 80 లక్షల రూపాయిలు జనసేన పార్టీ కి డొనేట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.