‘Okkadu’ collections : ‘ఒక్కడు’ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్.. మినిమం ఓపెనింగ్ కూడా వచ్చేలాలేదు!

‘Okkadu’ collections : మహేష్ బాబు ని స్టార్ హీరో గా మలిచిన చిత్రం ‘ఒక్కడు’..ఆ రోజుల్లో ఈ సినిమా ఒక ప్రభంజనం..అప్పటి కమర్షియల్ సినిమా ఫార్మాట్ కి సరికొత్త నిర్వచనం తెలిపిన చిత్రమిది..అందుకే టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది ఈ చిత్రం..ఈ సినిమా తర్వాత అదే కథ ని బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అలా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమా జనవరి 7 […]

Written By: NARESH, Updated On : January 5, 2023 9:31 pm
Follow us on

‘Okkadu’ collections : మహేష్ బాబు ని స్టార్ హీరో గా మలిచిన చిత్రం ‘ఒక్కడు’..ఆ రోజుల్లో ఈ సినిమా ఒక ప్రభంజనం..అప్పటి కమర్షియల్ సినిమా ఫార్మాట్ కి సరికొత్త నిర్వచనం తెలిపిన చిత్రమిది..అందుకే టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది ఈ చిత్రం..ఈ సినిమా తర్వాత అదే కథ ని బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.

అలా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమా జనవరి 7 వ తారీఖున 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దర్శక నిర్మాతలు మరోసారి రీ రిలీజ్ కి ప్లాన్ చేసారు..అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి..అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో పూర్తిగా చూడబోతున్నాము.

ముందుగా హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి..మహేష్ బాబు కి హైదరాబాద్ లో మంచి క్రేజ్ ఉంది..ఆయన హవా నైజాం లో ఒక్కడు సినిమా నుండే ప్రారంభం అయ్యింది..అలాంటి సినిమాకి వేరే లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని అందరూ ఊహించారు..ఆ అంచనాలు అన్నిటిని ఈ చిత్రం తలక్రిందులు చేసింది..కనీస స్థాయిలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు..సినిమాలను ఎగబడి చూసే రెండు మూడు ప్రాంతాలలో తప్ప , హైదరాబాద్ సిటీ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ఖాళీగానే ఉన్నాయి..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది..మొత్తం మీద హైదరాబాద్ సిటీ గ్రాస్ కనీసం 40 లక్షల రూపాయిలు కూడా రాకపోవడం విశేషం..ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా పరిస్థితి అయితే మరీ దారుణం గా ఉంది..ఇక్కడ కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

మహేష్ బాబు కి మంచి హోల్డ్ ఉన్న గుంటూరు మరియు వైజాగ్ వంటి ప్రాంతాలలో కూడా హౌస్ ఫుల్స్ రాకపోవడం బాధాకరం..మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి ఈ సినిమా 60 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..దీనినిబట్టి చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ సినిమా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా వసూలు చేసే సూచనలు కనిపించడం లేదు.