‘Khushi’ collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పట్లోనే కాదు..భవిష్యత్తులో కూడా ఎవ్వరూ అందుకోలేని అనితర సాధ్యమైన రికార్డు ని ఖుషి సినిమా రీ రిలీజ్ ద్వారా పెట్టారు..గత వారం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమా కి మొదటి రోజు మొదటి ఆట నుండే హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..విచిత్రం ఏమిటంటే ఈ చిత్రానికి కొన్ని ప్రాంతాలలో బెన్ఫిట్ షోస్ పడ్డాయి , కొన్ని చోట్ల ఉదయం ఆరు గంటలకే షోస్ ని ప్రారంభించారు.

స్టార్ హీరో కొత్త సినిమా విడుదల అయితే ఎలా ఉంటుందో..22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాకి కూడా అలాంటి హంగామానే ఉన్నింది..అందుకే పవన్ కళ్యాణ్ ని సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ట్రేడ్ వర్గాలు సైతం చెప్పుకుంటారు..ఇక ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యం లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
మొదటి రోజు ఈ చిత్రం జల్సా స్పెషల్ షోస్ రికార్డు ని బ్రేక్ చేస్తూ సుమారుగా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇక రెండవ రోజు న్యూ ఇయర్ అవ్వడం తో కలెక్షన్స్ అదిరిపోయాయి..సుమారుగా కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..అలా కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా వచ్చింది.
రెండు రోజులు పూర్తయిన తర్వాత పెద్దగా కలెక్షన్స్ ఉండకపోవచ్చు అని అభిమానులు సైతం అనుకున్నారు..కానీ వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్స్ ని నమోదు చేస్తూ వారం రోజుల్లో 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఇక వీకెండ్ కూడా ఈ చిత్రాన్ని బయ్యర్స్ థియేటర్స్ లో హోల్డ్ చేసుకోగలిగితే ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు.