England And Wales: శీర్షిక చదివి మీరు పొరబడకండి.. మీరు చదివింది నిజమే. ఒకప్పుడు భారతదేశాన్ని 250 సంవత్సరాల పాటు పాలించిన ఇంగ్లీష్ దేశస్తులు.. భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేసిన ఆ ఇంగ్లీష్ దేశస్తులు.. ఇప్పుడు తమ మతాన్ని చెప్పుకునేందుకు నిరాకరిస్తున్నారు.. దీంతో ఇంగ్లాండ్ దేశంలో క్రైస్తవులు మైనార్టీలుగా మారిపోయారు.. 2021 జనాభా లెక్కల ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్ క్రిస్టియన్ మైనార్టీ దేశాలుగా రూపాంతరం చెందాయి. ఈ దేశాల జనాభాలో సగం కంటే తక్కువ మంది తమను తాము క్రైస్తవులుగా మాత్రమే అభివర్ణించుకున్నారు.. 22.2 మిలియన్ ప్రజలు తమకు మతం లేదని ప్రకటించుకున్నారు. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వేరపీస్ట్ ఓ

ఎందుకు ఇలా
మారిన కాల పరిస్థితుల్లో మతం అంటే కొంతమందికి ఏవగింపు కలుగుతుంది.. ఆ మతం తరంగా చేపట్టే కార్యక్రమాలు వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ మతం వల్ల మనుషుల్లో వైషమ్యాలు పెరిగిపోయి రకరకాల గొడవలకు దారితీస్తున్నాయి.. ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న హిజాబ్ గొడవ కు కారణం మతమే కదా. అక్కడి దాకా ఎందుకు క్రిస్టియానిటీ ఉన్న ఇంగ్లాండ్లోనే జాతి పరమైన విభేదాలు ఉన్నాయి.. అమెరికా లాంటి దేశాల్లో శ్వేత జాతీయులు నల్లజాతీయులను చంపేస్తూ ఉంటారు.. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి.. వ్యక్తుల మధ్య గొడవలను ఎగదోస్తూ, వాటిని జాతుల మధ్య ఉన్న వైరంగా అభివర్ణిస్తూ చలికాచుకునే వాళ్ళు ఎంతోమంది.
మార్పు మొదలైంది
చార్లెస్ డార్విన్ సూత్రికరించిన నిర్వచనం ప్రకారం ఒక మనిషి చాందసమైన విధానాల నుంచి క్రమంగా బయటపడుతున్నాడు అంటే కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నాడని అర్థం. ఇది ఒక జాతి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయన అప్పట్లోనే చెప్పాడు.. ప్రస్తుతం ఆ దిశగానే ఇంగ్లాండ్, వేల్స్ ప్రజలు అడుగులు వేస్తున్నారు. మతం పేరు ఎందుకు చెప్పుకోవడం లేదని చాలామందిని ప్రశ్నిస్తే.. మేము మనుషులుగా బతికేందుకు ఇష్టపడుతున్నామని వారు చెప్పడం గమనార్హం. అయితే ఇది మనిషి పరిణతి వైపు సాగిస్తున్న తీరుకు నిదర్శనం.

ఇష్టం లేక నేనా?
మరోవైపు భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో క్రైస్తవ మతాన్ని పరివ్యాప్తం చేసేందుకు పాశ్చాత్య దేశాలు విరివిగా డబ్బులు ఇస్తూ ఉంటాయి.. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్జీవోలపై ఉక్కు పాదం మోపారు.. నీ వల్ల ఆయా సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధులు తగ్గిపోయాయి.. పైగా నిధులు ఇచ్చే విదేశాల వారిని కూడా లెక్కలు అడుగుతుండడంతో పరిస్థితి వేరే విధంగా మారిపోతుంది.. దీనికి తోడు మతం ఆధారంగా చేస్తున్న కార్యక్రమాల వల్ల చాలామందికి ఒక రకమైన ఏవగింపు భావం కలిగింది.. అందువల్ల చాలామంది మతానికి దూరంగా జరుగుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో మొదలైన ఈ పరిణామం మునుముందు దేనికి దారితీస్తుందో తెలియదు గానీ.. ఇప్పుడైతే ఇది ముందడుగు అని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. అని ఇదే సమయంలో ఇంగ్లాండ్ లాంటి దేశంలో హిందువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం విశేషం.. ఇదే సమయంలో వారు అక్కడ హిందూ దేవాలయాల్లో వివాహాలు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు.