కరోనా, లాక్ డౌన్ తరువాత టూ వీలర్, ఫోర్ వీలర్ కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. చాలామంది బైక్ కంటే స్కూటర్ ను కొనుగోలు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. అయితే కొత్తగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని టూ వీలర్లు అందుబాటులోకి వస్తుండటం గమనార్హం.
Also Read: ల్యాప్ టాప్ వేడెక్కుతోందా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
ఈ2గో ఈవీ పేరుతో అందుబాటులోకి దేశీయ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్ కొనడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రెండు వేరియంట్లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్కూటర్ అందుబాటులోకి రాగా ఈ2గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 52,999 రూపాయలుగా ఈ2గో లైట్ ధర 63,999 రూపాయలుగా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు, యువతులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: టీజర్ టాక్: రీఎంట్రీలో ‘వకీల్ సాబ్’ అదరగొట్టేశాడు
ఎటువంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వినియోగించే అవకాశం ఉండటం గమనార్హం. బైక్ కు ఆర్.సీ, లైసెన్స్ అవసరం లేదని అనుకునే వాళ్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కూటర్ ను ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి స్కూటర్ ను ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: వైరల్
అయితే ఈ స్కూటర్ పై గంటకు కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలుగుతాం. మోటార్ వెహికల్స్ చట్టం స్కూటర్ కావడంతో స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ స్కూటర్ బెస్ట్ అని చెప్పవచ్చు.