Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఎక్స్ గ్రేషియా కోసం భర్తనే చంపేసింది

ఒడిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి అనే మహిళ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లింది.  ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని,,, అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.వెంటనే అక్కడున్న ఫొటోలు చూడమని పోలీసులు సూచించారు.

Written By: Dharma, Updated On : June 7, 2023 2:36 pm
Follow us on

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం.. యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఊహకందని ప్రమాదం ఇది. మూడు దశాబ్దాల్లో భారీ రైలు ప్రమాదం ఇది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూస్తున్నారు. కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. అయితే మరోపక్క కేటుగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నష్టపరిహారం కోసం సరికొత్తగా అవతారమెత్తుతున్నారు. ఎవరూ గుర్తించని మృతదేహాలను తమ కుటుంబసభ్యులకు చెందినవేనని నమ్మిస్తున్నారు. మృతదేహాలను తీసుకుంటున్నారు. తరువాత మరణ ధ్రువీకరణ పత్రాలు సంపాదించి వారి పేరు మీద నష్టపరిహారాలు పొందుతున్నారు.

ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నవారిని గుర్తించిన ఒడిశా గవర్నమెంట్ అలెర్టయ్యింది. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.  ఓ మహిళ ద్వారా ఈ తరహా చర్యలను అధికారులు గుర్తించారు. ఒడిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి అనే మహిళ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లింది.  ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని,,, అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.వెంటనే అక్కడున్న ఫొటోలు చూడమని పోలీసులు సూచించారు. కొన్ని ఫోటోలు చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫొటో చూపిస్తూ అతనే తన  భర్తని చెప్పింది. నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు కూడా ఒక దశలో నమ్మారు.

అయితే గీతాంజలి ప్రవర్తనతో పోలీసులకు ఓకింత అనుమానం వచ్చింది. దీంతో వారు తమదైన శైలిలో విచారించేసరికి ఆమె నిజం ఒప్పుకుంది. తన భర్త బతికే ఉన్నాడని ఎక్స్ గ్రేషియ కోసమే ఇలా నాటకమాడానని చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉందని వెంటనే అలర్ట్ జారీ చేసింది. కేటుగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదని ఈ పరిణామం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం అని పోలీసులు సూచిస్తున్నారు.