https://oktelugu.com/

Kalabhairava’s Tweet : కాలభైరవ ట్వీట్ తో మండిపడ్డ ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్.. దెబ్బకు సారీ.. అసలేమైంది?

  Kalabhairava’s Tweet : ఒక్క ట్వీట్ చిచ్చుపెట్టింది. ఆస్కార్ అవార్డ్ కొట్టిన కీరవాణి తనయుడు, ‘నాటునాటు’ను ఆస్కార్ వేదికపై పాడిన కాలభైరవ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అసలు వివాదం ఏంటి? ఎందుకు ఇలా అయ్యిందన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు. ఆస్కార్ వేదికపై ‘నాటునాటు’ పాట పాడిన కాలభైరవ ఇండియాకు తిరిగి వస్తూ ఓ ట్వీట్ చేశాడు. అదే మంటపుట్టించింది. ఇంతకీ కాలభైరవ ఏమన్నాడంటే.. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 17, 2023 / 12:55 PM IST
    Follow us on

     

    Kalabhairava’s Tweet : ఒక్క ట్వీట్ చిచ్చుపెట్టింది. ఆస్కార్ అవార్డ్ కొట్టిన కీరవాణి తనయుడు, ‘నాటునాటు’ను ఆస్కార్ వేదికపై పాడిన కాలభైరవ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అసలు వివాదం ఏంటి? ఎందుకు ఇలా అయ్యిందన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు.

    ఆస్కార్ వేదికపై ‘నాటునాటు’ పాట పాడిన కాలభైరవ ఇండియాకు తిరిగి వస్తూ ఓ ట్వీట్ చేశాడు. అదే మంటపుట్టించింది. ఇంతకీ కాలభైరవ ఏమన్నాడంటే.. ‘ఆస్కార్ అకాడమీ అవార్డుల స్టేజీపై లైవ్ లో ‘నాటు నాటు’ ప్రదర్శన ఇచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను.. రాజమౌళి బాబా, పెద్దమ్మ, అమ్మనాన్న, కార్తికేయ, ప్రేమ్ రక్షిత్ ఇలా వీరందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాకు ఈ విలువైన అవకాశం దక్కేలా సాయం చేశారు. వాళ్ల శ్రమ, పనితనం వల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు చేరింది. ఈ పాట పాడే అవకాశం నన్ను వరించింది. వారి కారణంగానే నేను ఈ అందమైన అనుభూతిని పొందగలిగాను. ఈ వాస్తవాన్ని ఎప్పటికీ మరిచిపోను. వాళ్ల విజయంలో నేనూ భాగమైనందుకు ఆనందిస్తున్నా’ అని కాలభైరవ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ పేర్లను ప్రస్తావించకుండా కాలభైరవ ట్వీట్ చేయడాన్ని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో వారందరికీ క్షమాపణలు చెబుతూ కాలభైరవ తాజాగా ట్వీట్ చేశాడు. నేను చేసిన ట్వీట్ బయటవారికి మరోలా అర్థమైందని.. ఆస్కార్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వడానికి తోడ్పడిన వారికి కృతజ్ఞతలు చెప్పానని.. మరో ఉద్దేశం తనకు లేదని.. అందుకు క్షమించండి’ అంటూ కాలభైరవ తాజాగా ట్వీట్ చేశారు.