
NTR 30 Story Leak: ఎట్టకేలకు ఎన్టీఆర్ 30కి ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 24న అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఎత్తున పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు పెద్ద మొత్తంలో హాజరుకానున్నారట. లాంచింగ్ ఈవెంట్ తోనే దేశం మొత్తం మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్,గోవాలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారట. ఈ రెండు లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఏడాదిలో షూట్ కంప్లీట్ చేసి విడుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నిరవధికంగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 30 స్టోరీ ఇదే అంటూ సంచలన న్యూస్ బయటకు వచ్చింది. అదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమే. టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం… దర్శకుడు కొరటాల శివ హీరో ఎన్టీఆర్ ని డ్యూయల్ రోల్ లో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా కథ ఉంటుంది.
సముద్రం పోర్ట్, మాఫియా బ్యాక్ డ్రాప్ కలిగి ఉంటుందట. విలన్-హీరోకి మధ్య భీకరమైన ఆధిపత్యపోరు నడుస్తుందట. ఇక విలన్ గా స్టార్ హీరోని తీసుకోకున్నారట. హీరోకి గట్టి సవాల్ విసిరే విలన్ రోల్ పెద్ద నటుడు చేస్తే బాగుంటుందనేది కొరటాల ఆలోచనట. సంజయ్ దత్, విక్రమ్ వంటి నటుల పేర్లు పరిశీలిస్తున్నారట. ఆచార్య ఫెయిల్యూర్ తో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కసిగా కథ రాశారు అంటున్నారు.

తండ్రి కొడుకుల పాత్రలతో విలన్ కి ఉండే సన్నివేశాలు సినిమాకే మేజర్ హైలెట్ కానున్నాయట. మొత్తంగా ఎన్టీఆర్ 30 ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఊహించని విజువల్ ట్రీట్ అంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ 30 పై అంచనాలు ఆకాశానికి చేరాయి. అదే సమయంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఫ్యాన్స్ ని భయపెడుతుంది. ఎన్టీఆర్ గతంలో ఆంధ్రావాలా మూవీలో తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు. ఫలితం మాత్రం దెబ్బతీసింది. ఎన్టీఆర్ మూడుసార్లు డ్యూయల్ రోల్ చేశారు. అదుర్స్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. నా అల్లుడు ప్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు