
Lord Shiva: ఈనెల 18న మహాశివరాత్రి. దేశవ్యాప్తంగా శివాలయాలు కళకళలాడతాయి. దీప కాంతుల్లో వెలుగులీనుతాయి. శివయ్య కోసం అందరు ఉపవాస దీక్షలు చేయడం సహజం. ప్రతి ఇంట్లో శివుడికి హారతి ఇచ్చి పూజలు చేసి రాత్రి దీపాలు వెలిగించడం కామనే. దీంతో దేవాలయాలన్ని ముస్తాబవుతున్నాయి. శివ నామ స్మరణతో మారుమోగనున్నాయి. ఈ నేపథ్యంలో దైవాన్ని కొలిచి తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు కోరుకుంటారు. అయితే శివయ్యను కొలిచేందుకు ప్రత్యేక పూలను వాడతారు. అందరు దేవుళ్ల మాదిరి కాకుండా శంకరునికి ప్రత్యేకంగా అడవిలో పూచిన పూలంటేనే ఎక్కువగా ఇష్టపడతాడు. వాటితోనే పూజ చేసి శివుడికి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
శివయ్య ఇష్టపడే పూలేంటో తెలుసా?
శివుడికి ఇష్టమైన పూలేంటో తెలుసా? ఏ పూలతో శివుడిని కొలువాలో తెలుసా? శివుడికి అత్యంత ఇష్టమైన వాటిలో శమీ పువ్వు ఒకటి. తరువాత ధాతురా పుష్పం అంటే కూడా శివుడికి ప్రీతిపాత్రమైనది. మన సనాతన సంప్రదాయంలో బిల్వ పత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది శివుడికి అత్యంత ఇష్టమైనదిగా చెబుతారు. బిల్వ పత్రం లేనిదే శివుడికి పూజ చేయరంటే అతిశయోక్తి కాదు. మందార పువ్వు కూడా శివుడికి నచ్చినదే. కరవీర పువ్వుతో పూజిస్తే సంతోషిస్తాడు. ఇంకా జాస్మిన్, గులాబీలు, తామరపువ్వులు, నల్ల కలువ వంటి పూలు వాడితే శివుడు ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
ఏ పువ్వుతో..
శమీ పువ్వుతో శివుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇవి అంటే శంకరుడికి ఎంతో ప్రేమ. ఆది శంకరుడి పూజలో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోవడం మంచిది. శమీ పుష్పంతో పూజ చేయడం వల్ల మనకు ఎన్నో శుభాలు కలుగుతాయి. ధాతుర కూడా శివుడికి ఇష్టమే. అమృత మథనం సమయంలో ముందుగా వచ్చిన విషాన్ని మింగగానే శివుడి వక్షస్థలం నుంచి వికసించిన పుష్పమే ధాతుర అని పురాణాలు ఘోషిస్తున్నాయి. శివ పూజ సమయంలో ఈ పుష్పాన్ని శివుడికి పెట్టడం మంచిది.

బిల్వ పత్రంతో..
శివ పూజలో కచ్చితంగా ఉండాల్సింది బిల్వ పత్రాలు. ఇవి 11 కానీ, 21 కానీ లేకపోతే 3 గానీ పెట్టాలి. ఇవి పెడితే శివయ్య ఎంతో సంతోషిస్తాడట. అందుకే శివ పూజలో బిల్వ పత్రానికి అంతటి విలువ ఉంటుంది. ఇంకా ఎర్రని పూలు కూడా శివుడికి ఇష్టమైనవే. అందులో మందార పూలంటే మహా ఇష్టం. దీంతో శివుడికి సమర్పించే పూలలో ఇవి కూడా ఉంచుకోవడం మంచిదే. ఇలా శివుడికి అందించే పూల విషయంలో ఇన్ని నిబంధనలు ఉన్నాయని తెలుసుకుని చేయడం వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి.
కరవీర పువ్వుతో..
గులాబీ పువ్వులాగే ఉండే మరో రకమైన పువ్వు. ఇది చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. వ్యాధులు రాకుండా కాపాడుతుంది. శివుడికి సమర్పిస్తే మనకు కూడా రోగాలు రాకుండా చేస్తుందని నమ్ముతుంటారు. జాస్మిన్ పువ్వులు కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఇంట్లో ఐశ్వర్యం, సంపద పెరగాలంటే వీటితో పూజ చేయడం మంచిది. గులాబీ పువ్వులతో పూజించడం కూడా గుర్రాల బలితో సమానంగా భావిస్తారు. తామరపూలతో పూజిస్తే అవమానాలు తొలగిపోతాయి. నల్ల కలువతో పూజలు చేస్తే ఐదు పాపాలు హరిస్తాయి. ఇలా శివ పూజలో వీటిని ఉపయోగించి పూజలు చేసి పరమాత్ముని సన్నిధి చేరుకోవాలని కోరుకుంటారు.