Election Strategist Sunil: ఉదయం లేస్తే నమస్తే తెలంగాణలో, ఆ టీ న్యూస్ లో ప్రసారమయ్యేది భారత రాష్ట్ర సమితి వార్తలే కదా! ఒకవేళ ఏ మాత్రం స్పేస్ ఉన్న అందులో నింపేది కాంగ్రెస్ పార్టీ, బిజెపి వ్యతిరేక వార్తలు.. అఫ్కోర్స్ ఇక్కడ అవి వార్తలు అనబడవు.. వాటిని కేసీఆర్ కొనుక్కున్నాడు కనుక.. ఆయన ట్యూన్ లోనే పనిచేస్తాయి.. ఇక యూట్యూబ్ ఛానెల్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. సామాజిక మాధ్యమాల ఖాతాల గురించి అసలు వివరించాల్సిన పనిలేదు.. టన్నుల కొద్ది విషం… క్వింటాళ్లకొద్ది అసత్యం.. ఇందులో ఎవరూ సుద్దపూస కాదు.. ఇలాంటి పరిస్థితుల్లో సునీల్ అనే వ్యక్తిని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎందుకు కార్నర్ చేసిందనేదే ప్రధాన ప్రశ్న.

ఇక్కడి నుంచే మొదలు
వాస్తవానికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతి విషయంలోనూ సునీల్ కనగోలు పాత్ర ఉంటున్నది. రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ దానికి ఇన్ పుట్స్ ఇచ్చేది సునీల్ బృందమే. అందువల్లే వరంగల్ డిక్లరేషన్ సభ భారీ స్థాయిలో విజయవంతమైంది. తర్వాత గజ్వేల్, సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన సభలు జనాల్లో చర్చను రేకెత్తించాయి. సో వీటి వెనుక ఉన్నది మొత్తం సునీల్ బృందమే అని కెసిఆర్ కు అర్థమైంది.. వెంటనే పోలీసులను రంగంలోకి దింపి చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వేచి చూశారు..
అదును చూసి దెబ్బ కొట్టారు
సునీల్ కూడా పీకే దగ్గర పని చేసిన వారే. ఆ రాబిన్ శర్మ కూడా.. అయితే పీకే తో తేడాలు రావడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. పైగా వేరే వేరే పార్టీలకు పనిచేస్తున్నారు..సునీల్ కాంగ్రెస్ పార్టీకి ట్యూన్ అయ్యాడు..పైగా ఈయనకి కొప్పుల రాజు తో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం ప్రారంభించాడు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు సునీల్ కూడా కారణం.. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డికి హార్డ్ కోర్ గా పని చేయడం సునీల్ ప్రారంభించాడు.

వారికి తగ్గట్టుగానే జనాల్లోకి కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా వెళ్తున్నది. అయితే ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న కేసీఆర్… దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని భావించి… సునీల్ ఆఫీస్ పై పోలీసులతో దాడి చేయించాడు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సీజ్ చేయించాడు. ఈ దాడులతో సునీల్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే పోలీసులు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. సో ఇదీ అసలు కథ.