Khushi Re Release: ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..స్టార్ హీరోల వింటేజ్ సూపర్ హిట్ చిత్రాలను 4K కి మార్చి భారీ లెవెల్ లో విడుదల చేస్తున్నారు..అలా ఇప్పటి వరకు చాలా సినిమాలే విడుదలైనప్పటి పోకిరి మరియు జల్సా సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మిగిలిన సినిమాలకు ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు..తమ్ముడు మరియు ఒక్కడు సినిమాలను కొన్ని చోట్ల ప్రదర్శించారు..వాటికి మంచి గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

మధ్యలో ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాని రీ రిలీజ్ చేసారు..కొన్ని చోట్ల బాగానే ఆడింది ఈ చిత్రం..తర్వాత బిల్లా, బాద్షా, రెబెల్ మరియు వర్షం వంటి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసారు..ఒక్క సినిమా కూడా జల్సా మరియు పోకిరి క్రేజ్ ని మ్యాచ్ చేయలేకపోయాయి..కానీ ఖుషి చిత్రం మాత్రం రికార్డ్స్ అన్నిటిని తిరగరాసే విధంగానే ముందుకు దూసుకుపోతుంది..నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభించారు.
నిన్న ఒక్క రోజే ఈ సినిమాకి లక్ష కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తుంది..కొత్త సినిమాకి కూడా ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం మనం ఇంతకు ముందు చూసి ఉండము..ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనం అని అంటున్నారు ఫ్యాన్స్..రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా క్రెడిట్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతుల్లోనే ఉంది.

జల్సా సినిమాకి దాదాపుగా మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది కేవలం టాలీవుడ్ లోనే కాదు..ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఆ రికార్డు ని ఖుషి కేవలం నైజాం ప్రాంతం నుండే బ్రేక్ చెయ్యొచ్చు అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట..మరో వారం రోజులకు పైగా సినిమా రన్ ఉంటుంది కాబట్టి కచ్చితంగా పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.