Norwegian diplomat Erik Solheim: ప్రకృతి రమణీయతకు ముగ్దులవ్వని వారెవరు? దాని అందం చూస్తే అంతే. మనసు ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. మనదేశం ప్రకృతి సంపదలకు నెలవు. ఇందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రదేశాలు సుందరమయంగా కనిపిస్తాయి. అక్కడి అందాలను చూస్తే అబ్బురపడాల్సిందే. ప్రకృతిని చూసి పరవశం పొందాల్సిందే. దీనికి హిమాచల్ ప్రదేశ్ అతీతం కాదు. అక్కడ ఉండే సుందరమైన ప్రదేశాలు మనకు ఎంతో హాయిని కలిగిస్తాయి. మనసును ఉల్లాసంగా చేస్తాయి. వాటిని చూస్తే మతి పోవాల్సిందే. అక్కడి అందాలను తనివితీరా చూస్తూ ఉండిపోవాల్సిందే. పర్యాటకులకు ఎన్నో మధురమైన అనుభూతులను పంచుతున్న రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలుస్తోంది.

భారతదేశంలోని సుప్రసిద్ధ ప్రదేశాలను దర్శిస్తూ హిమాచల్ ప్రదేశ్ కు చేరుకున్న నార్వేజియన్ దౌత్యవేత్త ఎరిక్ సోల్హీమ్ ఇక్కడి సుందర ప్రదేశాలను చూసి మనసు పారేసుకున్నాడు. ఇంతటి మనోహరమైన ప్రదేశాలను ఎన్నడు చూడలేదని ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఓ విదేశీయుడు డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఇక్కడి ప్రకృతిని అందంగా చిత్రీకరించి నెట్లో ఉంచాడు. దీంతో ప్రకృతి రమణీయతకు పెద్దపీట వేయడంతో అందరు ఆస్వాదిస్తున్నారు. స్పితి వ్యాలీ చల్లని ప్రదేశం చూస్తే అబ్బురపడాల్సిందే.
హిమాచల్ ప్రదేశ్ ఎంత సుందరమైందో అందరికి తెలిసిందే. దాని ముగ్దమనోహరానికి పొంగిపోని వారుండరు. దీంతో ఎరిక్ సోల్హీమ్ ట్వీట్ చేసిన ఫొటోలకు ఇప్పటికే నాలుగు వేల లైకులు రావడం గమనార్హం. ట్విట్టర్ లో పలువురు స్పందిస్తున్నారు. హిమాచల్ అందాలకు పరవశులవుతున్నారు. ప్రకృతి అందాలు పెయింటింగ్ లా ఉన్నాయని రాస్తున్నారు. అద్భుతమైన దృశ్యాలను చూసి కనువిందు చేసుకుంటున్నారు. ప్రకృతి పారవశ్యంపై ప్రజలు మంత్రముగ్దులవుతున్నారు.

ప్రకృతి అందాలను చూస్తే పరవశించాల్సిందే. వాటిని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అద్భుతమైన ప్రకృతి మన సొంతం. మన దగ్గర ఉన్న సుందరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో హిమాచల్ ప్రదేశ్ అందం మాటల్లో చెప్పలేనిది. అందుకే నార్వేజియన్ తన ఫొటోలతో ప్రజలకు చూపించి ప్రకృతిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. మన అందాలను ఓ విదేశీయుడు చెబితే గానీ తెలుసుకోలేని వారం కాదు కానీ అతడి ఫొటోల ప్రతిభకు అందరు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రకృతి సోయగాలను తన కెమెరాల్లో బంధించి అందరికి చూపించి అతడికి ప్రకృతిపై ఉన్న ప్రేమ తెలియజేస్తోందనడంలో అతిశయోక్తి లేదు.