Nithya Menen: ఇది ఎవరూ ఊహించని ట్విస్ట్. మలయాళ కుట్టి నిత్యామీనన్ గర్భవతిని అంటూ స్వయంగా ప్రకటించుకున్నారు. దీనికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో నిత్యామీనన్ వ్యవహారం నేషనల్ వైడ్ న్యూస్ అయింది. మంచి నటిగా పేరున్న నిత్యామీనన్ జీవితంలో వివాదాలు రూమర్స్ ఉన్నాయి. ఆమె ఓ కన్నడ స్టార్ హీరోతో సహజీవనం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరొక పెళ్ళైన కోలీవుడ్ టాప్ హీరోతో వ్యవహారం నడిపారనే వాదన కూడా ఉంది. ఇలా రెండు మూడు ఎఫైర్ రూమర్స్ వినిపించాయి.

ఈ క్రమంలో నిత్యా మీనన్ గర్బవతిని అంటూ స్వయంగా ప్రకటించుకుంది. నేరుగా చెప్పకుండా పాజిటివ్ రిజల్ట్ చూపిస్తున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక అద్భుతం మొదలు కాబోతుంది.. అంటూ కామెంట్ యాడ్ చేశారు. నిత్యామీనన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. పెళ్లి కాకుండా ఈ ప్రకటనేంటి! అనే షాక్ లో ఉండిపోయారు అందరూ. నిన్ను గర్భవతిని చేసిన ఆ వ్యక్తి ఎవరని నెటిజెన్స్ నిత్యామీనన్ ని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇది ఆమె కొత్త సినిమా ప్రమోషనల్ స్టంట్ కూడా కావచ్చనే వాదన వినిపిస్తోంది. తన సినిమాకు ప్రచారం కల్పించడం కోసం ఇలా సంచలన పోస్ట్ చేసి నలుగురు మాట్లాడుకునేలా చేశారు అంటున్నారు. నిజంగా ఆమె పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఆ విషయం ఎలా బయటపెడతారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా నిత్యామీనన్ పోస్ట్ సోషల్ మీడియాను కుదిపేసింది. ఇక దీనిపై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

తెలుగులో కనుమరుగైన నిత్యామీనన్ ఇటీవల భీమ్లా నాయక్ మూవీలో మెరిశారు. పవన్ కళ్యాణ్ భార్యగా మెప్పించారు. భీమ్లా నాయక్ కి మించిన తిక్క కలిగిన భార్యగా నిత్యామీనన్ ఫెరోషియస్ రోల్ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ఇక నిత్యా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ బ్రీత్ సీజన్ 2 నవంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేశారు. బ్రీత్ ఫస్ట్ సీజన్లో కూడా నిత్యామీనన్ నటించారు. ఆ సిరీస్లో నిత్యా మీనన్ లెస్బియన్ సన్నివేశాల్లో నటించడం విశేషం. కిడ్నాప్ అయిన తమ కూతురిని కాపాడుకునే పేరెంట్స్ గా అభిషేక్, నిత్యా కనిపించారు.
View this post on Instagram