RGV- Jagan Vyooham: అనుకున్నట్టే రాంగోపాల్ వర్మ బయటపెట్టాడు. ఇటీవల ఏపీ సీఎం జగన్ ను సీక్రెట్ కలిసి మంతనాలు జరిపిన ఈ వివాదాస్పద దర్శకుడు అందరూ అంచనావేసినట్టే నిన్న ‘వ్యూహం’ చిత్రాన్ని తీయబోతున్నట్టు తెలిపాడు. అది ఎవరిపైన అనేది నేడు బయటపెట్టాడు. ఇందులో పాత్రదారులంతా ఏపీలోని రాజకీయ పార్టీల నేతలే కావడం గమనార్హం.

తాజాగా తాను ఏపీ రాజకీయాలపై తీయబోయే ‘వ్యూహం’ చిత్రంలో పాత్రధారుల పేర్లను బయటపెట్టి మరో సంచలనానికి తెరతీశాడు వర్మ. నిజానికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సినిమాలు తీయబోతున్నట్టు వార్తలు వచ్చినా.. వాటిని పటాపంచలు చేస్తూ ఏపీ రాజకీయాలపైనే సినిమా తీయడానికి రెడీ అయ్యారు.
రాంగోపాల్ వర్మ తీసే ‘వ్యూహం’ చిత్రంలో పాత్రధారులు ఎవరన్నది తాజాగా వర్మ బయటపెట్టాడు. ఇందులో బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, జగన్ లు ఉంటారని.. వీరిచుట్టూనే సినిమా కథ తిరుగుతందని వర్మ ట్విట్టర్ లో ప్రకటించాడు.

దీంతో కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే కాకుండా జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలందరినీ వర్మ టార్గెట్ చేశాడని తెలుస్తోంది. వైఎస్ జగన్ అండ్ టీం ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఓ వైసీపీ ఎంపీ ఈ వర్మ తీయబోయే సినిమాకు భారీ పెట్టుబడి సమకూర్చబోతున్నాడట.. మరి వర్మ-జగన్ ల ‘వ్యూహం’ ఎలా ఉండబోతుందన్నది వేచిచూడలి.