Anant Ambani: ప్రపంచంలో ఇప్పుడున్న వాతవరణ పరిస్థితుల వల్ల కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. నేటి కాలంలో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా వ్యాయామం తప్పని సరి అని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరు వ్యాయామం చేసి, మెడిసిన్ తీసుకున్నా సన్నబడడం లేదు. కానీ కొందరు మాత్రం ఊహించనంతగా స్లిమ్ గా మారిపోతున్నారు. ఇలాంగే అనంత్ అంబానీ కూడా కొన్ని రోజుల పాటు బరువుతో కనిపించాడు. ఆ తరువాత సన్నబడ్డాడు. అయితే మళ్లీ అదేస్థాయిలో లావయ్యాడు. కొన్ని నెలల కిందట రాధిక మర్చంట్ అనే అమ్మాయితో అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో ఆయన మళ్లీ బరువు పెరడానికి కారణాలేంటి? అని ఆరా తీస్తున్నారు.
దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ గురించి ఎలాంటి విషయమైనా పెద్ద చర్చే అవుతుంది. ఆయనతో పాటు కుటుంబసభ్యుల గురించి ఇటీవల నెట్టింట్లో తెగ చర్చించుకుంటున్నారు. ముఖేష్ ,నీతూ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్న కొడుకు అనంత్ అంబానీ. రాధిక మర్చంట్ అనే అమ్మాయితో అనంత్ అంబాని నిశ్చితార్థం గత జనవరిలో జరిగింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన లావుగా కనిపించడం చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
2016 సంవత్సరానికి ముందు అనంత్ అంబానీ 200 కిలోల బరువు ఉండేవారు. కానీ ఈ సంవత్సరంలో ఆయన 100 కిలోలకు మారాడు. అంతకుముందు లావుగా కనిపించిన ఆయన స్లిమ్ గా హీరో లెవల్లో మారిపోవడం చూసి షాక్ అయ్యారు. దీంతో ఆయన బరువు తగ్గడానికి కారణాలేంటి అని చాలా మంది సెర్చ్ చేశారు. రోజూ 5 గంటల పాటు వ్యాయమం చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు తగ్గినట్లు అప్పట్లో చెప్పారు.
ఆ తరువాత మీడియా ముందుకు ఎక్కువగా రాని అనంత్ అంబాన్నీ 2022 లో ఆయనకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ లో అనంత్ అంబానీ భారీ కాయంతో కనిపించాడు. అయితే ఇలా మారడానికి కారణాలేంటి అని కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకున్నారు. అంతేకాకుండా కొందరు అసభ్య కర కామెంట్లు చేశారు. దీంతో అనంత్ తల్లి నీతూ అంబానీ ఈ కామెంట్స పై ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమారుడికి అస్తమా ఉందని, అది తగ్గడానికి స్టెరాయిడ్స్ వాడారని, అందువల్ల మళ్లీ బరువు పెరిగాడని నీతూ అంబానీ చెప్పారు. అంతేకాకుండా అసభ్యకర కామెంట్లు చేసేవారికి ఆమె హెచ్చరిక జారీ చేశారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించిన బరువు తగ్గరు. కానీ అనంత్ అంబానీ బరువు తగ్గడానికి విపరీతంగా కష్టపడ్డాడు. ప్రతీరోజూ వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటించారు.