Nilofer Cafe : సోషల్ మీడియా చూసినా.. ప్రధాన మీడియా చూసినా చర్చ మొత్తం నీలోఫర్ కేఫ్ గురించే.. ఏ ముహూర్తానయితే బాబురావు నీలోఫర్ కేఫ్ ను హైటెక్ సిటీలో ప్రారంభించాడో.. ఇక అప్పట్నుంచి జరుగుతున్న చర్చ మాములుగా లేదు. అక్కడ దొరికే బన్, చాయ్ గురించి రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. చాయ్ ధర ఎక్కువ ఉందని.. బన్ ధర కూడా అదే స్థాయిలో ఉందని.. ఇక్కడ చాయ్ తాగే బదులు బయట పది చాయ్ లు తాగవచ్చని..ఇక్కడ బన్ కొనుక్కుని తినే బదులు.. బయట హోటల్లో కడుపునిండా భోజనం చేయవచ్చని.. సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఎన్ని వచ్చినా.. ఎన్ని కనిపించినా నిలోఫర్ కేఫ్ లో మాత్రం రద్దీ తగ్గడం లేదు. ఏదో జాతరకు వచ్చినట్టు జనం అక్కడికి వెళ్తున్నారు. జీవితంలో ఎన్నడూ చాయ్ తాగనట్టు.. అక్కడ చాయ్ తాగుతున్నారు. బన్ మస్కా తినేస్తున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో.. అక్కడి యాంబియన్స్ ఉండడంతో నిలోఫర్ కేఫ్ గురించి ఒక రేంజ్ లో చర్చ జరుగుతుంది.. దాదాపు 5 ఫ్లోర్లు ఉన్న నిలోఫర్ కేఫ్ లో.. వారి స్థాయికి తగ్గట్టుగా చాయ్ తాగవచ్చు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
Also Read : ఎండాకాలంలో దుప్పట్లా.. ఈ బ్రెయిన్ తో మంత్రివయ్యా వంటే గ్రేటే సారో?
ధైర్యం చేశాడు
నిలోఫర్ కేఫ్ ప్రతినెల చెల్లించే రెంట్ దాదాపు 40 లక్షలు. ఇప్పటికే పది సంవత్సరాలకు బాండ్ రాసుకున్నారు. ప్రతి ఏడాది రెండు శాతం రెంట్ లో పెంపుదల ఉంటుంది. జనాన్ని చూస్తే ఒక్కరోజులోనే నెల రెంటు కు సరిపోయే ఆదాయం నీలోఫర్ కేఫ్ యాజమాన్యానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా నీలోఫర్ కేఫ్ యాజమాన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇక హైటెక్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీలోఫర్ ఓ యువకుడు సహకారం చేశాడు. దాని ఎదురుగానే చాయ్ బండి పెట్టాడు. అతడికి కూడా గిరాకీ బాగానే ఉంది. నీలోఫర్ కేఫ్ లో చాయ్ తాగలేని వారు.. ఇక్కడి చాయ్ బండి వద్ద చాయ్ తాగుతున్నారు. నీలోఫర్ కేఫ్ ఎదుట ధైర్యంగా నిలబడి “సిప్ ” లాగుతున్నారు. చాయ్ బండి వ్యక్తి ఆదాయం కూడా బాగానే ఉంది. కేఫ్ నీలోఫర్లో చాయ్ తాగలేని వారు. తన బండి వద్ద చాయ్ తాగుతున్నారని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాకు ఎక్కింది. ఇంకేముంది అతని గురించి చర్చ మొదలైంది. అయితే కొంతమంది మాత్రం ఆ చాయ్ బండి వ్యక్తి పొట్టగొట్టొద్దని.. ఈ విషయం కనుక నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావుకు తెలిస్తే.. ఆ వ్యక్తి చాయ్ బండిని అక్కడి నుంచి తొలగిస్తాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు.. కవితకు జనసేన ‘జోకర్’ కౌంటర్..