https://oktelugu.com/

18 Pages Trailer Released : ప్రేమించడానికి ఒక రీజన్ ఉండకూడదు… ఫీలింగ్ గుడ్ లవ్ స్టోరీగా 18 పేజెస్!

18 Pages Trailer Released : నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. వీరు జంటగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఫాంటసీ అండ్ సోషల్ డ్రామా కార్తికేయ 2 దేశాన్ని ఊపేసింది. భారీ వసూళ్లు సాధించిన కార్తికేయ 2 నిఖిల్ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కార్తికేయ 2 మూవీని ప్రేక్షకులు మరిచిపోకముందే మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు నిఖిల్. నెలల వ్యవధిలో మళ్ళీ ప్రేక్షకులను పలకరించనున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2022 / 09:06 AM IST
    Follow us on

    18 Pages Trailer Released : నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. వీరు జంటగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఫాంటసీ అండ్ సోషల్ డ్రామా కార్తికేయ 2 దేశాన్ని ఊపేసింది. భారీ వసూళ్లు సాధించిన కార్తికేయ 2 నిఖిల్ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కార్తికేయ 2 మూవీని ప్రేక్షకులు మరిచిపోకముందే మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు నిఖిల్. నెలల వ్యవధిలో మళ్ళీ ప్రేక్షకులను పలకరించనున్నారు. 18 పేజెస్ టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ డిసెంబర్ 23న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

    ఈ నేపథ్యంలో 18 పేజెస్ చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ లవ్, రొమాన్స్, యాక్షన్ , థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంది. ఫేస్ బుక్ లేని, మొబైల్ వాడని అరుదైన ఈ జెనరేషన్ అమ్మాయిగా అనుపమను పరిచయం చేశారు. ఆమె లుక్ కూడా చాలా సింపుల్ గా , పల్లెటూరి అమ్మాయి వలె ఉంది. అనుపమ-నిఖిల్ లవ్ డ్రామా సినిమాకు హైలెట్.

    అయితే అనుపమ రాసిన ఒక డైరీ చుట్టూ 18 పేజెస్ మూవీ తిరుగుతుందని తెలుస్తుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లో సస్పెన్సు, థ్రిల్లింగ్ అంశాలు జోడించారు. ట్రైలర్ లో నిఖిల్ యాక్షన్ ని కూడా మనం చూడవచ్చు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించిన నేపథ్యంలో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ట్రైలర్ అంచనాలు మరింతగా పెంచేసింది. అనుపమ రోల్ సినిమాకు చాలా కీలకం. హీరోయిన్ కి కథలో చాలా ప్రాధాన్యత ఉన్న చిత్రం ఇది.

    బిగ్ బాస్ ఫేమ్ సరయు 18 పేజెస్ మూవీలో కీలక రోల్ చేయడం విశేషం. ఆమె హీరో నిఖిల్ ఫ్రెండ్ రోల్ చేశారు. సుకుమార్ శిష్యుల్లో ఒకరైన పలనాటి సూర్య ప్రతాప్ ఈ చిత్ర దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. 18 పేజెస్ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ లో ఆయన ఇచ్చిన బీజీఎం ఆకట్టుకుంది. మొత్తంగా 18 పేజెస్ మూవీతో నిఖిల్-అనుపమ జంట మరో హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని నిరూపిస్తారనిపిస్తుంది.