18 Pages Movie Review: నటీనటులు : నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ , భూపాల్ రాజ్
కథ : సుకుమార్
దర్శకత్వం : సూర్య ప్రతాప్
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్
నిర్మాణ సంస్థ : గీత ఆర్ట్స్
సినిమాటోగ్రాఫర్: వసంత్
ఎడిటర్ : నవీన్ నూలి

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించి కాసుల కనకవర్షం కురిపించిన చిత్రం ‘కార్తికేయ 2 ‘..ఈ చిత్రం ద్వారా నిఖిల్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించాడు..సుమారుగా 60 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రం తర్వాత నిఖిల్ మార్కెట్ మూడింతలు పెరిగింది..కెరీర్ లో అలాంటి పీక్ ని ఎంజాయ్ చేస్తున్న సమయం లో ఆయన నుండి వచ్చిన చిత్రం ’18 పేజెస్’..ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించాడు..సుకుమార్ శిష్యులలో ఒకరైన సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కార్తికేయ 2 లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది..గీత ఆర్ట్స్ సమర్పణ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
కథ :
మొబైల్ ఫోన్ కి ఇంటర్నెట్ కి పూర్తి దూరంగా ఉండే ఒక అమ్మాయి నందిని (అనుపమ పరమేశ్వరన్ )..అలాంటి అమ్మాయి తో సిద్దార్థ్ (నిఖిల్ ) అనే అబ్బాయి ప్రేమలో పడుతాడు..సిద్దార్థ్ తో నందిని ప్రేమలో పడిన తర్వాత కొన్ని సంఘటనలు జరగడం వల్ల నందిని కి మెమరీ లాస్ ఉందని సిద్దార్థ్ కి అర్థం అవుతుంది..తనకి మెమరీ లాస్ ఉందని గ్రహించిన నందిని తన జీవితం లో జరిగిన ప్రతి సంఘటన ని డైరీ లో రాసుకుంటూ ఉంటుంది..అలా ఆ డైరీ లో 18 వ పేజీలో ఆమె జీవితం లో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంటుంది..ఇక ఆ తర్వాత సిద్దార్థ్ అండగా నిలబడి ఆమె జీవితం లో చోటు చేసుకున్న ఆ సంఘటన ఎలా కనుగొన్నాడు అనేదే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
డైరెక్టర్ సుకుమార్ రాసుకునే కథలు చాలా యూనిక్ గా ఉంటాయి..కథలో కొత్తదనం ప్రతి షాట్ లో కనిపిస్తుంది..18 పేజెస్ కథ కూడా అలాంటిదే..ప్రారంభం నుండే సుక్కుమార్క్ కనిపిస్తుంది..డైరెక్టర్ సూర్య ప్రతాప్ కూడా కథనం ని చాలా గ్రిప్పింగ్ గా ముందుకు నడుపుతాడు..ఎక్కడ కూడా బోర్ కొట్టదు..ఆసక్తిగా కొనసాగుతూ తర్వాత ఏమి జరుగుతుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించాడు..ఫస్ట్ హాఫ్ మొత్తం ఆసక్తికరమైన లవ్ ట్రాక్ తో సాగిపోతుంది..సెకండ్ హాఫ్ కి సరిపడా సాలిడ్ కంటెంట్ ని ఇంటర్వెల్ అప్పుడే సిద్ధం చెయ్యడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు..ప్రేక్షకుల్లో సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ ని కలిగించాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రం లో తన నట విశ్వరూపం చూపించింది అని చెప్పాలి..సందర్భానికి తగ్గట్టుగా భావోద్వేగాలను ఆమె చాలా సహజం గా చేసింది..ఇక హీరో నిఖిల్ పర్వాలేదు అనే రేంజ్ లో చేసాడు..కొన్ని సన్నివేశాలలో ఆయన నటన సహజత్వానికి దూరంగా ఉంది..ఇక గోపి సుందర్ అందించిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసాడు..సినిమాకి కథనే ఎక్కువ పాత్ర పోషించింది కాబట్టి సాంగ్స్ ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు..మొత్తానికి నిఖిల్ కార్తికేయ 2 తర్వాత మరో హిట్ పడిందనే చెప్పొచ్చు..కానీ ఈ చిత్రం కార్తికేయ 2 రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

చివరి మాట :
కొత్త తరహా కథలను చూడడానికి ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక విందు భోజనం లాంటిది..ఈ వీకెండ్ లో ఆడియన్స్ మరో బెస్ట్ ఛాయస్ అనే చెప్పొచ్చు.
రేటింగ్ : 2.75/5