Niharika Konidela : నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె హీరోయిన్ గా ఎదగాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా నిహారిక వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్ కావాలని సహనం చేసిన అమ్మాయి నిహారిక. ఈ విషయంలో నిహారిక వ్యతిరేకత ఎదుర్కొంది. నిహారిక హీరోయిన్ కావడానికి వీల్లేదని మెగా ఫ్యాన్స్ ఆందోళన చేశారు.
అయితే ఎదిరించి తన లక్ష్యం వైపుగా అడుగులు వేసింది. నిహారిక మొదటి చిత్రం ఒక మనసు. ఎమోషనల్ ట్రాజిక్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. నిహారిక నటనకు ప్రశంసలు దక్కాయి. ఒక మనసు చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించాడు. అయితే ఒక మనసు కమర్షియల్ గా ఆడలేదు. అనంతరం సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలతో అలరించింది. ఒకటి రెండు తమిళ చిత్రాలు కూడా చేసింది. అయితే నిహారికకు బ్రేక్ రాలేదు.
ఈ క్రమంలో ఆమె వివాహానికి ఒప్పుకున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధం వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక వివాహం ఐదు రోజులు ఘనంగా జరిగింది. రెండేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు ప్రకటించారు. విడాకుల అనంతరం నిహారిక మరలా కెరీర్ పై దృష్టి పెట్టింది.
సొంతగా ఆఫీస్ ఓపెన్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో చిత్రాలు, సిరీస్లు ప్లాన్ చేస్తుంది. యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ తో నిహారిక కలిసి పని చేస్తున్నారు. అదే సమయంలో నటిగా ఎదగాలని అనుకుంటున్నారు. నిహారిక ఇటీవల డెడ్ పిక్సెల్స్ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేసింది. ఇది ఆన్లైన్ గేమింగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మరోవైపు గ్లామరస్ ఫోటో షూట్స్ కి తెరలేపుతుంది. ట్రైబల్ గెటప్ లో నిహారిక లుక్ సరికొత్తగా ఉంది.