New Method On Copying: ఎగ్జామ్స్ అంటే కొందరు కష్టపడి చదువుతారు. మరికొందరు కష్టపడి కాపీ కొడతారు. నిద్రాహారాలు మాని చదువుతారు కొందరు. మరికొందరు నిద్రాహారాలు మాని కాపీ కొట్టడానికి స్లిప్పులు తయారు చేస్తారు. పరీక్షల్లో గట్టెక్కడానికి ఓ విద్యార్థిని చేసిన నిర్వాకం ఉపాధ్యాయుల్ని నివ్వెరపోయేలా చేసింది. ఆమె వినూత్న ఐడియాకి ఉపాధ్యాయులు షాక్ తిన్నారు.

పరీక్షలు అనగానే ఓ విద్యార్థిని కాపీ స్లిప్పులు తయారు చేసింది. ఏ ప్రశ్న వచ్చినా తన దగ్గర ఉన్న ఆన్సరే రాయాలని నిర్ణయించుకుంది. దీంతో తమ ఇంట్లో శుభకార్యం జరిగినట్టు బిల్డప్ ఇస్తూ.. చేతులకు మెహందీ పూసుకుంది. ఆ మెహందీ డిజైన్ల మధ్యలో మ్యాథ్స్ ఫార్మాలాలు రాసిపెట్టింది. అవి కనపడకుండా ఫుల్ హ్యాండ్స్ డ్రస్ వేసుకుంది. పరీక్ష హాల్ లో ఫుల్ హ్యాండ్స్ పైకి కిందికి లాగుతుండటంతో ఎగ్జామినర్ కి అనుమానం వచ్చింది.

ఒక్కసారి తరచి చూస్తే ఆ స్టూడెంట్ భాగోతం బయటపడింది. మెహందీ డిజైన్ల మధ్యలో మ్యాథ్స్ ఫార్ములాలు బయటపడ్డాయి. ఆ విద్యార్థిని పేపర్ లాక్కుని ఎగ్జామినర్ బయటకు పంపేసింది. కాపీ కొట్టడానికి ఆ విద్యార్థిని పడ్డ ఆపసోపాలు చూసి ఉపాధ్యాయులు నవ్వుకున్నారు. కాపీ కొట్టడానికి పడే కష్టం .. చదవడానికి పడితే ఈజీగా పాస్ అవుతారు కదా అని ఆ విద్యార్థినికి హితబోధ చేశారు.