Karnataka: వివాహేతర సంబంధాలు.. వైవాహిక బంధాలను కూల్చుతున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లయి భార్య ఉన్న భర్తలు, భర్త సుఖ పెట్టడం లేదని భార్యలు వివాహేతర సబంధాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ బంధాలు బయటపడి విడాకులకు దారితీస్తున్నాయి. కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఓ కొత్త జంట కాపురంలో ఓ చిన్న మెస్సేజ్ చిచ్చురేపింది. చివరకు నవ వధువు ఆత్మహత్యకు కారణమైంది.
15 ఏళ్ల ప్రేమ.. పెళ్లి..
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడిలో సుఖేష్ అనే యువకుడు, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కౌసల్యా 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సుఖేష్‌కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన కౌసల్యాను పెళ్లి చేసుకోవడానికి సుఖేష్ కుటుంబ సభ్యులు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు.
హ్యాపీగా హనీమూన్‌కు..
వివాహం చేసుకున్న కౌసల్యా, సుఖేష్ దంపతులు పలు ప్రాంతాలకు హనీమూన్‌కు వెళ్లారు. హనీమూన్‌లో ఎంజాయ్ చేస్తున్న కౌసల్యా, సుఖేష్ దంపతులు చాలా రోజులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో సుఖేష్ మొబైల్ ఫోన్‌కు అతని వదిన ఆస్తికా ఓ మేసేజ్ పంపించింది. భర్త మొబైల్ ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసిన భార్య కౌసల్య షాక్ అయింది.
ఏముందా మెసేజ్‌లో..
ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. ‘సుఖేష్ ఎలా ఉన్నావు, ఇక మీదట నా అవసరం నీకు ఉండదని అనుకుంటున్నాను, నీకు నీ భార్య చిక్కింది, ఇక నా పడక సుఖం నీకు అవసరం లేదని అనుకుంటున్నా, నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తున్నావు, ఇక్కడ నేను మాత్రం ఒంటరిగా ఉన్నాను. నువ్వు నీ భార్య కౌసల్యాతో హ్యాపీగా ఉండూ, నన్ను నువ్వు మరిచిపో, నాతో మాట్లాడకు’ అని అస్తికా చేసిన మెసేజ్‌లో ఉంది. ఈ మెసేజ్ చదివిన కౌసల్య హడలిపోయింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త సుఖేష్ అతని వదిన ఆస్తికాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న కౌసల్యా ఆవేదన చెందింది.
ఫోన్ బ్యాకప్‌లో బాగోతం..
హనీమూన్‌లో కౌసల్య ఆమె భర్త సుఖేష్‌ను ఈ మెసేజ్ గురించి ఒక్క మాట కూడా అనలేదు. సుఖేష్, అతని వదిన అక్రమ సంబంధం గురించి తెలియనట్లు నటించింది. ఊరికి వచ్చిన తరువాత కౌసల్య ఆమె భర్త సుఖేష్ మొబైల్ ఫోన్ వాట్సాప్ బ్యాకప్‌ను ఆమె మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ అయ్యేలా చేసింది. భర్త సుఖేష్‌కు ఏమాత్రం డౌట్ రాకుండా అతన్ని ఫ్రీగా వదిలేసిన కౌసల్యా వాట్సాప్ చాటింగ్ మీద నిఘా వేసింది.
సుఖేష్ తండ్రితో పంచాయితీ..
హానీమూన్ నుంచి వచ్చిన తరువాత సుఖేష్ అతని వదినతో హానీమూన్ విశేషాలు షేర్ చేసుకున్నాడు. సుఖేష్, అతని వదిన ఆస్తికా బూతుల చాటింగ్ చేసుకోవడం, రహస్యంగా కలుసుకోవడం చేశారు. భర్త వాట్సాప్ చాటింగ్ మొత్తం చూసిన కౌసల్యా భర్త సుఖేష్ తండ్రి దగ్గర పంచాయితీ పెట్టడంతో గొడవ పెద్దది అయ్యింది. ‘నువ్వు మా ఇంటికి వచ్చిన తరువాత గొడవలు మొదలయ్యాయి. నువ్వు కొన్ని విషయాలు చూసిచూడనట్లు వదిలేయాలి’ అని సుఖేష్ తండ్రి కౌసల్యకు సూచించాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుఖేష్ తనను మోసం చేస్తున్నాడని తట్టుకోలేని కౌసల్యా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
వదినతో వన్స్ మోర్ అంటూ ఎంజాయ్ చేసిన సుఖేష్‌ను కౌసల్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వదిన అస్తికాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.