
Upasana- Surrogacy Controversy: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం #RRR మూవీ ద్వారా వచ్చిన పాన్ వరల్డ్ హీరో ఇమేజిని ఎంజాయ్ చేస్తున్నాడు.హాలీవుడ్ లో #RRR సినిమాకి ఫేస్ గా మారి అనేక ఇంటర్వ్యూస్ ఇస్తున్న రామ్ చరణ్, ఈ నెల 12 వ తేదీన ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో #RRR మూవీ టీం తో కలిసి హాజరు కాబోతున్నాడు.’నాటు నాటు’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరి లో నామినేట్ అయినా సంగతి తెలిసిందే.ఈ అవార్డు గెలుచుకునేందుకు అడుగు దూరం లో ఉన్నారు.అందుతున్న సమాచారం ప్రకారం ఆ క్యాటగిరి లో #RRR కచ్చితంగా అవార్డుని సొంతం చేసుకుంటుందని తెలుస్తుంది.
ఒక పక్క ఈ రేంజ్ లో పాపులారిటీ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ , త్వరలో తండ్రి కాబోతున్నాడు అనే వార్త అభిమానులను మరింత కిక్ ఇచ్చే న్యూస్.అయితే ఉపాసన గర్భం దాల్చిన ఫోటోలు సరిగా కనిపించకపోవడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి అనేక అనుమానాలు తలెత్తాయి.
ఉపాసన కి నిజంగా గర్భం రాలేదని, సరోగసి ద్వారానే ఆమె బిడ్డకి జన్మని ఇస్తుందని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యాయి.ఇక రామ్ చరణ్ దురాభిమానులు కూడా ఈ విషయాన్నీ బాగా హైలైట్ చేసారు.దీనితో ఉపాసన నిన్న రామ్ చరణ్ తో కలిసి అమెరికా లో షాపింగ్ చేసిన ఫోటోలను తన ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో షేర్ చేసింది.

ఇందులో ఆమెకి బేబీ బంప్ ఉన్నట్టు స్పష్టంగా తెలియడం తో ఇన్ని రోజులు సరోగసి ద్వారా బిడ్డకి జన్మని ఇస్తుందనే వార్తలకు చెక్ పెట్టేసింది.ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ దంపతుల బిడ్డ ఈ లోకం లోకి అడుగుపెట్టబోతుంది.రామ్ చరణ్ కి పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు దక్కిన తర్వాత జరుగుతున్నా శుభకార్యం కావడం తో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.
