Sri Satya- Srihan: బిగ్ బాస్ సీజన్ 6 మరో నాలుగు రోజుల్లో ముగియబోతోంది..ఎన్నడూ లేని విధంగా 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరు మంది కంటెస్టెంట్స్ కి చేరుకుంది.. గత వారం ఇనాయ ఎలిమినేట్ అవ్వగా రేపు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా ఒక కంటెస్టెంట్ ని బయటకి పంపేయబోతున్నారు..ఆ కంటెస్టెంట్ శ్రీ సత్యనే అని తెలుస్తోంది..కానీ బిగ్ బాస్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.. శ్రీసత్య బదులు ఆది రెడ్డి ఎలిమినేట్ అవ్వొచ్చు.. లేదా టైటిల్ విన్నర్ అని మన అందరం అనుకుంటున్న రేవంత్ మరియు శ్రీహన్ లలో కూడా ఒకరు అవ్వొచ్చు.

ఎందుకంటే ఈ సీజన్ మొత్తం ఇలాగే ఎవ్వరూ ఊహించని రీతిలో ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగింది..ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు..ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అనేది చివరి నిమిషం వరకు తెలియని పరిస్థితి ఏర్పడింది..ఇక ఈ చివరి వారంలో తొలి రెండు రోజులు టాప్ 6 కంటెస్టెంట్స్ గా నిలిచినా వాళ్లకి సంబంధించిన జర్నీ ని గార్డెన్ ఏరియా లో ప్రొజెక్టర్ ద్వారా ప్లే చేసారు.
కంటెస్టెంట్స్ అందరూ తమ బిగ్ బాస్ జర్నీ ని చూసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు..అలా సాగిపోతున్న ఈ షోలో ఈరోజు శ్రీహాన్ మరియు శ్రీసత్య మధ్య గొడవలు చెలరేగాయి..అసలు విషయానికి వస్తే ఈరోజు బిగ్ బాస్ ప్రేక్షకులకు కంటెస్టెంట్స్ ఓట్లు అప్పీల్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు..కానీ ఈ అవకాశం ఊరికే మాత్రం కాదు..టాస్కు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది..ముందుగా బిగ్ బాస్ వరుసగా ప్లే చేసే సౌండ్స్ ని గుర్తుపట్టి పేపర్ మీద కరెక్ట్ గా రాయాలి..అలా ఎవరైతే ఎక్కువ శాతం కరెక్ట్ గా రాస్తారో, వాళ్లకి ప్రేక్షకులను వోట్లని అప్పీల్ చేసుకునే అవకాశం కలిపిస్తాడు బిగ్ బాస్.

అయితే సౌండ్స్ ప్లే చేస్తున్న సమయంలో శ్రీ సత్య మాట్లాడడం వల్ల శ్రీహాన్ రెండు పాయింట్లు కోల్పోతాడు..దానికి అతను చేసిన రచ్చ అంతాఇంతా కాదు..కావాలనే గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీ సత్య తో గొడవపడినట్టు చూసే ప్రతీ ఒక్కరికి అనిపించింది..ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ వాడివేడి వాతావరణం లో కొనసాగింది..కనీసం చివరి వారం లోనైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని నెటిజెన్స్ అంటున్నారు.