KCR- Ravi Prakash: టీవీ9 నుంచి రవి ప్రకాష్ అత్యంత అవమానకరమైన రీతిలో బయటకు వెళ్ళాడు.. దీని గురించి చర్చ అనవసరం.. కానీ దీని వెనక ఎవరు ఉన్నారు? ఎందుకు ఉన్నారు? అనేది మీడియాకు విధితమే. తర్వాత రవి ప్రకాష్ తొలి వెలుగు అని ఒక వెబ్ ఛానల్ ఏర్పాటు చేశాడు. అందులో ఉదయం లేస్తే కెసిఆర్ కు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రసారాలు ఉండేవి.. కానీ కొద్దిరోజుల నుంచి ఆ తొలి వెలుగు గులాబీ రంగు పూసుకుంది.. దీన్ని చూస్తున్న వాళ్లకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది.. అదే సమయంలో అనుమానం కూడా కలిగింది. తీరా చూస్తే భారత రాష్ట్ర సమితి ఫోల్డ్ లోకి రవి ప్రకాష్ వెళ్ళిపోయాడు. కెసిఆర్ పిలవగానే ఎస్… సార్ అనేశాడు.. ఇప్పుడు దేశంలో చక్రాలు తిప్పేందుకు, ఢిల్లీలో పగ్గాలు చేపట్టేందుకు కెసిఆర్ రాజశ్యామల యాగాలు చేస్తున్నాడు.. ఆ యాగాన్ని కవర్ చేయాలంటే మీడియా అవసరం కనుక… ఇప్పుడు ఆ బాధ్యత రవి ప్రకాష్ చేతుల్లో పెట్టాడు.

రవి ప్రకాష్ అంటే టీవీ9.. టీవీ9 అంటే రవి ప్రకాష్… ఇప్పుడు అది మై హోమ్ రామేశ్వరరావు విత్ మేఘా కృష్ణారెడ్డి.. కొంతకాలంగా ఆ ఇద్దరు బడా కాంట్రాక్టర్లు కేసీఆర్ తో కటీఫ్ చెప్పుకున్నారు. బిజెపి ఫోల్డ్ లో ఉన్నారని పొలిటికల్ వర్గాల సమాచారం. ఆఫ్ కోర్స్ వాళ్ళు వ్యాపారులు.. ఎవరి హవా నడిస్తే వారి వద్దకు వెళ్తారు.. వారి ఒత్తిడి మేరకే ఆ మధ్య టీవీ9 ను రవి ప్రకాష్ వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో మై హోమ్ కు, కెసిఆర్ కు టరమ్స్ బాగున్నప్పుడు రవి ప్రకాష్ ను బయటకు వెళ్లగొట్టారు. అంతేకాదు కేసులు పెట్టి సతాయించారు. అంతేకాదు తాను ఏర్పాటు చేసిన ఛానల్ లోనే తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేయించారు. తాను పెట్టుకున్న మోజో టీవీని మూసేయించారు. ఇదే సమయంలో రవి ప్రకాష్ బిజెపి శిబిరానికి దగ్గర అయ్యాడు. తొలి వెలుగు అని ఒక ఛానల్ ప్రారంభించాడు. తర్వాత కెసిఆర్, అతడి పార్టీ మీద విభిన్నమైన కథనాలు ప్రసారం చేయించేవాడు.
-ఇప్పుడు దగ్గరయ్యాడు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మీడియాలోనూ అలాగే ఉంటుంది. ఇది రవి ప్రకాష్, కేసీఆర్ ఎపిసోడ్ తో మరోసారి నిరూపితమైంది.. కెసిఆర్ కు తన జాతీయ రాజకీయాల కోసం కొత్త ఛానల్స్ అవసరం పడింది.. ఆ కొత్త ఛానళ్ళను మొదలు పెట్టడంలో నైపుణ్యం ఉన్న రవి ప్రకాష్ కనిపించాడు. వెంటనే పిలిచాడు. గతంలో జరిగినవన్నీ మర్చిపో.. ఇప్పుడు కొత్తగా మొదలుపెడదాం అని అన్నాడు.. కళ్ళు చెదిరే ఆఫర్ కళ్ళ ముందు ఉంచాడు. ఇంకేముంది దోస్తీ కుదిరింది. టీ న్యూస్ ఉండగా ఇదంతా ఎందుకు అనే అనుమానం మీకు రావచ్చు.. టీ న్యూస్ ఉంటే ఉన్నట్టు. లేకుంటే లేనట్టు. అదంతా ఒక ఎక్స్ట్రా ఫింగర్ బాపతి. జాతీయ రాజకీయాలు అంటే హిందీ, ఇంగ్లీష్ చానల్స్ ఉండాలి కాబట్టి.. దీనికి రవి ప్రకాష్ కూడా ఓకే చెప్పాడు.. దీంతో ఇన్నాళ్లు కేసీఆర్ మీద విషయాన్ని కక్కిన తొలి వెలుగు ఛానల్ ఇప్పుడు గులాబీ రంగులోకి చేరిపోయింది. ఇక కెసిఆర్ చెప్పినట్టు రవి ప్రకాష్, హిందీ ఇంగ్లీష్ చానల్స్ తీసుకురాబోతున్నాడు. కానీ ఇవన్నీ ఎవరూ చెప్పరు.. గుట్టుగా సాగిపోతూ ఉంటాయి.. గతంలో ఎప్పటినుంచో ప్రచారం ఉన్నదే.. అయితే రవి ప్రకాష్ జర్నలిస్టుకు, కెసిఆర్ పొలిటికల్ అవసరాలకు పొంతన ఎక్కడ కుదురుతుందా అనేది ఇప్పుడు పెద్ద అనుమానం.

రవి ప్రకాష్ కు టీవీ9 లో షేర్లు ఉన్నాయి.. వాటిపై వివాదాలు ఉన్నాయి. ట్రిబ్యునల్ వద్ద కేసులు ఉన్నాయి. ఈ సమయంలో అతనికి కెసిఆర్ సపోర్ట్ అవసరం.. రవి ప్రకాష్ బిజెపికి కూడా ఇష్టమైన వ్యక్తే. మోడీ షా లతో కూడా కాంటాక్ట్ లోకి వెళ్లగలడు. ఆ మధ్య టీవీ9 భారత్ వర్ష ను మోదీని పిలిచి ప్రారంభించాడు. కానీ ఇప్పుడు తన కేసులకు సంబంధించి ఎవరు సపోర్ట్ ఇస్తే వారి వైపు వెళ్లగలిగే సత్తా ఉన్నవాడు.. రాజకీయం లాగానే జర్నలిజం కూడా వెరీ డైనమిక్.. ఇప్పుడు ఉన్న స్థితి మరి కాసేపటికి ఉండదు.. అన్నట్టు తెలంగాణ టుడే అనే ఇంగ్లీష్ పేపర్ కెసిఆర్ కు ఉంది.. ఆ నమస్తే తెలంగాణను ఏం చేస్తారు? ఒకవేళ హిందీ వర్షన్ మొదలు పెడితే ఎవరూ బాధ్యత తీసుకుంటారు? తిగుళ్ళ కృష్ణమూర్తికి ఆ బాధ్యత అప్పగిస్తారా? లేక అమర్ ఉజాలా నుంచి ఎవరినైనా తెస్తారా? వేచిచూడాలి..