Work From Home A Legal Right: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియాలోని పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. అంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు కంపెనీలు కల్పించాయి. గతంతో పోలిస్తే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. ఈ విధానంతో చాలామంది ఐటీ ఉద్యోగులు దేశంలో సొంత ఊళ్లకు వచ్చి, కుటుబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం లభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ ఉద్యోగులు సొంత పనులు చూసుకుంటూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ ఉద్యోగాలు చేశారు. చేస్తున్నారు. తమకు ఇష్టమైన వ్యవసాయంపైనా కొంతమంది దృష్టిపెట్టారు. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం ఉద్యోగుల హక్కుగా మారనుంది. ఈ ప్రతిపాదనపై డచ్ పార్లమెంట్ దిగువ సభ తీర్మానం చేసింది. దీనికి సెనేట్ ఆమోదం తెలపగానే చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఉద్యోగుల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే దేశంగా నెదర్లాండ్స్‌కు పేరుంది.

కంపెనీల తిరస్కరణతో చట్టం..
ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థకు ‘వర్క్ ఫ్రం హోం’ కోరుతూ అభ్యర్థన పెట్టుకుంటే కారణం చెప్పకుండానే పలు కంపెనీలు అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నాయి. ఈ జాబితాలో టెస్లా వంటి ప్రముఖ కంపెనీ కూడా ఉంది. ఇటీవల టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తమ ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని లేదా కంపెనీని విడిచిపోవాలని హెచ్చరించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Also Read: Ram Pothineni Interview: ఇంటర్వ్యూ: రామ్ – ఆమె విషయంలో మా ఇంట్లో కూడా నన్ను అనుమానించారు !
చాలామంది తమకు నచ్చిన ఉద్యోగాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నెదర్లాండ్స్ వారి సమస్యలను గుర్తించింది. వర్క్ ఫ్రమ్ హోం విధానంపై నెదర్లాండ్స్ పార్లమెంట్ తాజాగా చేసిన చట్టానికి సెనేట్ ఆమోదం తెలిపితే.. ఈ చట్టం ప్రకారం ఉద్యోగుల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అభ్యర్థనను కంపెనీలు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్ తీర్మానంపై అక్కడ పనిచేసే వివిధ కంపెనీల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశం నుంచి అక్కడకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం డచ్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

పనితీరులో తేడా రాకుండా..
కంపెనీలు అప్పగించే పనిని నిబద్ధతతో, పనితీరులో ఎలాంటి మార్పు లేకుండా పనిచేస్తే కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి ఆసక్తిగానే ఉన్నాయి. తద్వారా కంపెనీలపై నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. కార్యాలయాల నిర్వహణకు పెద్దగా స్పేస్ అవసరం ఉండదు. విద్యుత్, ఇంటర్నెట్ వినియోగం, ఖర్చు తగ్గుతాయి. ఖర్చు తగ్గింపుపై దృష్టిపెట్టిన కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. మార్కెట్‌లో ఆఫీస్ స్పేస్ అద్దెలు భారీగా పెరగడం కూడా ఇందుకు కారణం. మరోవైపు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read:Meteorological Analysis : తెలంగాణలో వచ్చే మూడు రోజులు డేంజర్..వాతావరణ హెచ్చరిక